1982లో దొంగతనం చేశాడు.. ఇప్పుడు దొరికాడు!  

38 Years ago Robbery in Bank, Robbers, Bank Robbery, Thief caught after 38 years of robbery - Telugu 38 Years Ago Robbery In Bank, Bank Robbery, Robbers, Thief Caught After 38 Years Of Robbery

ఇప్పుడు పట్టుకొని ఎం చేస్తారు బాబు? అని మీకు డౌట్ వచ్చింది కదా! కానీ ఎప్పుడు దొంగతనం చేసిన దొంగనే కదా! అలానే 38 ఏళ్ళ క్రితం దొంగతనం చేసి సాఫీగా బతుకుతున్న గజదొంగను పట్టుకున్నారు గుజరాత్ పోలీసులు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Bank Robbery 38 Years Ago

గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలోని అమిర్ ఘర్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొందరు దొంగలు 1982 డిసెంబర్ 30 వ తేదీన దోచుకొన్నారు.

ఇంకా ఆ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆ దొంగలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ శివదత్ శర్మను చంపేశారు.ఇంకా అనంతరం రూ.1.32 లక్షలు తీసుకొని పారిపోయారు.అయితే ఈ దొంగతనం చేసిన ముఠాలో ఇద్దరు దొంగలు కొద్దీ రోజులకే దొరకగా, ఆ గ్యాంగులో మరో నలుగురు మరణించారు.

1982లో దొంగతనం చేశాడు.. ఇప్పుడు దొరికాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ముఠాలోని దీప్ సింగ్ రాజ్‌పుత్ ఒక్కడే జీవించి ఉన్నాడు.దీప్ సింగ్ పై హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి 9 కేసులు రాజస్థాన్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి.

అయితే ఇన్నేళ్లు గుట్టుగా జీవితం గడుపుతున్న దీప్ సింగ్ ను రాజస్థాన్ లో అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం గుజరాత్ కు తరలించారు.ప్రస్తుతం ఈ దొంగ వయసు 68 ఏళ్లు.

#Bank Robbery #Robbers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bank Robbery 38 Years Ago Related Telugu News,Photos/Pics,Images..