పని ఒత్తిడిని తట్టుకోలేక దారుణానికి తెగబడిన బ్యాంకు మేనేజర్.. ?- Bank Manager Commits Suicide Due To Work Stress

bank manager commits suicide due to work stress kerala, Bank manager, commits suicide, work stress - Telugu Bank Manager, Commits Suicide, Kerala, Work Stress

మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు అదుపుతప్పుతుంది.అప్పుడు వచ్చే ఆలోచనలు జీవితాన్నే మార్చేస్తాయని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.

 Bank Manager Commits Suicide Due To Work Stress-TeluguStop.com

ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఉద్యోగి (38) ‌గతేడాది సెప్టెంబర్‌లో ప్రమోషన్‌పై త్రిస్సుర్‌ నుంచి కొతుపరంబాలోని తొక్కిలంగడి బ్రాంచ్‌కు మేనేజర్‌గా వచ్చింది.కాగా ఇక్కడ ఎదురైయ్యే పని ఒత్తిడిని తట్టుకోలేక శనివారం తాను పని చేస్తున్న బ్యాంకులోనే బలవన్మరణానికి పాల్పడిందట.

 Bank Manager Commits Suicide Due To Work Stress-పని ఒత్తిడిని తట్టుకోలేక దారుణానికి తెగబడిన బ్యాంకు మేనేజర్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ విషయాన్ని తోటి ఉద్యోగి గమనించి సహోద్యోగుల సహాయంతో ఆస్పటల్‌కు తరలించారు.కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారట.

ఇక ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకులో ఆమె మరణించిన గదిని పరిశీలించగా, అక్కడ ఒక డైరీ కనిపించడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారట.అయితే ఈ డైరీలో తాను పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నానని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నది.

#Kerala #Bank Manager #Commits Suicide #Work Stress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు