బ్యాంక్‌ హాలిడేస్‌.. వచ్చే నెల 12 రోజులు బంద్‌!

ఆగస్టు నెల పూర్తవుతోంది.మరి కొన్ని రోజుల్లో సెప్టెంబర్‌ 2021 రానుంది.

 Bank Holidays In September 2021 Will Remain Closed For 12 Days Next Month-TeluguStop.com

ఈ నేపథ్యంలో వచ్చే నెలలో అన్నీ ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు 12 రోజులపాటు మూసివేయనున్నారు.ఈ సందర్భంగా మీకు ఏమైనా ముఖ్యమైన పని బ్యాంకుల్లో ఉంటే ఈ బ్యాంకుల సెలవులను గుర్తుంచుకుంటే మేలు.

ఆ వివరాలు తెలుసుకుందాం.ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతోపాటు, విదేశీ బ్యాంకులు, కోఆపరేటీవ్‌ బ్యాంక్స్, రీజియనల్‌ రూరల్‌ బ్యాంకులు దేశావ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లను మూసివేయనున్నారు.

 Bank Holidays In September 2021 Will Remain Closed For 12 Days Next Month-బ్యాంక్‌ హాలిడేస్‌.. వచ్చే నెల 12 రోజులు బంద్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్‌బీఐ కేటగరీల వారీగా సెలవులను ప్రకటించింది.నెగొషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్, హాలిడే, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ హాలిడే, బ్యాంకుల ఖాతాల క్లోజింగ్‌ హాలిడేస్‌గా ప్రకటించింది.

ఈ బ్యాంక్‌ సెలవులు రాష్ట్రాలవారీగా మారనున్నాయి.

సాధారణంగా గాంధీ జయంతి (అక్టోబర్‌ 2), క్రిస్ట్‌మస్‌ (డిసెంబర్‌ 25), దీపావళి, ఈద్, గురునానక్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడేలలో అన్నీ బ్యాంకులకు సెలవులు.

అంతేకాదు, ప్రతినెల రెండు, మూడు శనివారాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయన్న విషయం తెలిసిందే.ఆదివారాలు మామూలు సెలవుగా ఆర్‌బీఐ ప్రకటించింది.అధికారికంగా సెప్టెంబర్‌ మాసం 7 బ్యాంకు సెలవులను ప్రకటించింది.రాష్ట్రవ్యాప్త సెలవులు, రిలీజియస్‌ వేడుకలు, ఇతర పండగ సందర్భంగా హాలిడేస్‌ వచ్చాయి.

మిగతా 6 వీకెండ్‌ లీవ్స్‌.

Telugu 12 Days Bank Holidays, August, Bank Holidays, Bank Holidays 2021, Banks Ramain Closed, Ganesh Chaturthi, Rbi, Second Saturday, September, Sundays-Latest News - Telugu

2021 సెప్టెంబర్‌ నెల బ్యాంకు సెలవుల వివరాలు.

సెప్టెంబర్‌ 5 –ఆదివారం
సెప్టెంబర్‌ 8– శ్రీమంత శంకరదేవ తిథి (గువహటీ)
సెప్టెంబర్‌ 9– తీజ్‌ (హరితాలిక) గ్యాంగ్‌టాక్‌
సెప్టెంబర్‌ 10– గణేశ్‌ చతుర్థి (అహ్మదాబాద్, బెలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ)
సెప్టెంబర్‌ 11– రెండో శనివారం
సెప్టెంబర్‌ 12– ఆదివారం
సెప్టెంబర్‌ 17– కర్మపూజ (రాంచి)
సెప్టెంబర్‌ 19– ఆదివారం
సెప్టెంబర్‌ 20– ఇంద్రజత్ర (గ్యాంగ్‌టాక్‌)
సెప్టెంబర్‌ 21 – శ్రీ నారాయణ గురు సమాధి డే (కొచ్చి, తిరువనంతపురం)
సెప్టెంబర్‌ 25– నాలుగో శనివారం
సెప్టెంబర్‌ 26– ఆదివారం.

#Bank Holidays #Banks Ramain #Bank Holidays #September #Sundays

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు