నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌

ఈమద్య కాలంలో సినిమాల్లో ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.తమ వర్గం వారిని విమర్శించారు అంటూ కొందరు, తమను కించపర్చారు అంటూ మరి కొందరు, ఇక తమ మనోభావాలు దెబ్బ తీశారు అంటూ ఇంకొందరు మీడియాలో నానా హైరానా చేస్తున్నారు.

 Bank Employee Union Serious On Hero Nagarjuna-TeluguStop.com

దాంతో ఏం చేయాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది.అయినా కూడా ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉండటం పరిపాటి అయ్యింది.

తాజాగా కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ యాడ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ అంటే నమ్మకం అని, ఆ నమ్మకంను పోగొట్టుకోం అంటూ నాగార్జున ఒక యాడ్‌లో నటించాడు.

ముసలి వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించాడు.ఒక బ్యాంకుకు వెళ్లి తన పెన్షన్‌ డబ్బు రెండు సార్లు వచ్చిందంటూ ఫిర్యాదు చేస్తాడు.రెండు సార్లు పెన్షన్‌ పడితే పార్టీ చేసుకోవాలి కాని, ఇలా ఫిర్యాదు చేయడానికి రావడం ఏంటీ అంటూ ఆ బ్యాంక్‌ మేనేజర్‌ జోక్‌ చేస్తాడు.అంతుకు ముందు సదరు ముసలి వ్యక్తితో బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ దురుసుగా ప్రవర్తిస్తారు.

ఈ మొత్తం యాడ్‌లో కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ గొప్పదనంను చూపించేందుకు ప్రయత్నించారు, అయితే బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ను మాత్రం చిన్నతనం చేసేలా చూపించారు.

ఇప్పుడు ఇదే వివాదం పెద్దది అవుతుంది.తెలుగులో నాగార్జున చేసిన యాడ్‌ను హిందీలో అమితాబచ్చన్‌ చేయడం జరిగింది.దేశ వ్యాప్తంగా ఈ యాడ్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బ్యాంక్‌ ఉద్యోగుల యూనియన్‌ ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకుల్లో వర్క్‌ చేసే వారిపై చులకన భావం కలిగేలా ఈ యాడ్‌లో చూపించారు అని, ఈయాడ్‌ తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఇప్పటికే ఈ యాడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు అని, ముందుగా వారితో మాట్లాడతామని చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ ఆ యాడ్‌ త్వరలోనే నిలిపేయాల్సి వస్తుందని కొందరు భావిస్తున్నారు.మొత్తానికి ఎంతో క్రియేటివిటీతో ఆలోచించి చేసిన యాడ్‌ను ఉన్నపళంగా నిలిపేయాల్సి వస్తుంది.ఇలా ఈమద్య కాలంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి.ముందు ముందు ప్రతీది కూడా వివాదాస్పదం అయితే సినిమాలు ఎలా చేయాలో అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube