వైరల్: ఈవిడ ఏమైనా కుంభకర్ణుని చెల్లెలా..?!

నిద్రలేమి సమస్య ఎంత ప్రమాదమో అతి నిద్రతో కూడా అంతే అనర్ధం.అతిగా నిద్రపోయిన వారికి గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

 Banjarmasin Girl Sleeping Upto Thirteen Days At A Time , Kumba Karna, Sleeping G-TeluguStop.com

ఒక మనిషికి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.అంతకన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్టు అధ్యయనకర్తలు తేల్చారు.

అలాగే ఎనిమిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో 35 శాతం గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది.అతి నిద్ర మూలంగా డీఎన్‌ఏ సైతం మారుతున్నట్టు వెల్లడైంది.

తొమ్మిది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో డిప్రెషన్‌ వచ్చే లక్షణాలు కూడా బయటపడ్డాయి.అలాగే ఏడుకన్నా తక్కువ గంటలు నిద్రపోయే వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి.

కనుక రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం ఉత్తమం.అప్పుడప్పుడు తొమ్మిది గంటలు దాటినా ఫర్వాలేదు కానీ రోజూ అతినిద్ర అలవాటు లేకపోవడమే మంచిది.

అయితే ఇక్కడొక అమ్మాయి మాత్రం ఒక్కసారి నిద్రపోతే మళ్లీ 13 రోజుల తర్వాతే మేల్కొంటుంది.వినడానికి విడ్డూరంగానే ఉన్నా అదే నిజం.

దక్షిణ కాలిమంటన్ ప్రాంతంలోని బంజర్‌మాసిన్‌లో నివసిస్తున్న ఏచా అనే 17 ఏళ్ల బాలికకు వింత రోగం ఉంది.

ఆమె నిద్రపోతే 13 రోజులు నిద్ర నుంచి లేవదు.2017 సంవత్సరంలో వరుసగా 13 రోజులు నిద్రపోయి ఆశ్చర్యపరిచింది.ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

సాధారణంగా ఒకటి రెండు రోజులు ఆహారపానీయాలు మానేస్తేనే ఎంతో నీరసం వచ్చేస్తుంది.అలాంటిది ఏచా వరుసగా 13 రోజులు నిద్రపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఏచా తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని చూసి అన్సారీ సలేమ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.అయితే, ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు.

నిరంతరాయంగా నిద్రపోవడం వల్ల ఆమె చాలా బలహీనంగా ఉందని తెలిపారు.‘హైపర్సోమ్నియా’ అనే అరుదైన న్యూరోలాజికల్ సమస్య వల్ల ఆమె అంతసేపు నిద్రపోతుందని వైద్యులు పేర్కొన్నారు.

ఈ పరిస్థితి వల్ల సాధారణ కంటే ఎక్కువ సేపు నిద్రపోతారని తెలిపారు.ఈ పరిస్థితి జన్యు లేదా మానసిక సమస్యల వల్ల తలెత్తే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం ఈ సమస్యకు చికిత్స లేదని వైద్యులు నిర్దారించారు.తల్లిదండ్రులు మాత్రం ఆమె కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube