మద్యం సేవించడం, పార్టీలు జరుపుకోవడం తప్పు కాదు...

ఈ మధ్యకాలంలో కొందరు ఇతరులపై ఉన్నటువంటి అసూయ కారణంగా వారిని ఎదగకుండా చేయాలనే దురుద్దేశంతో తమ పలుకుబడిని ఉపయోగించి సంబంధం లేనటువంటి కేసులలో ఇరికిస్తూ కటకటాల పాలు చేస్తున్నారు.కాగా తాజాగా ఇటీవలే బంగ్లాదేశ్ దేశానికి చెందిన ప్రముఖ నటి పోరి మొనీ ఇంట్లో మత్తు మందు పదార్థాలు మరియు భారీగా మద్యం బాటిళ్లు దొరకడంతో పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Bangladeshi Writer Talisma Nasrin Supporting To The Pori Moni, Pori Moni, Bangla-TeluguStop.com

దీంతో తాజాగా ఈ అరెస్ట్ విషయంపై బంగ్లాదేశ్ దేశానికి చెందిన ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా సమాజంలో మగవాళ్ళకి మాదిరిగానే ఆడవాళ్ళకి కూడా మద్యం సేవించే హక్కు మరియు తమకు ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కు ఉంటుందని ఈ క్రమంలో తన ఇంట్లో మద్యం నిల్వ ఉంచుకోవడం అలాగే తన స్నేహితులు లేదా ఇతర స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు పార్టీలు జరుపుకోవడం వంటివి నేరం కాదని తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా తన సినీ కెరీర్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోరి మొనీ స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో కొంతమంది ఓర్వలేక పై ఆమెపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయించారని తన మద్దతు తెలిపింది.అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ అధికారులను కోరింది.

Telugu Drugs, Pori Moni-Movie

కాగా ఆ మధ్య నటి పోరి మనీ మద్యం మరియు మత్తు పదార్థాల నిర్వహణ సంబంధిత కేసులు అరెస్టు కావడంతో అభిమాన సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.అంతేకాకుండా తమ అభిమాన నటి ని విడుదల చేయాలంటూ పలు చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు.

Telugu Drugs, Pori Moni-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా చిన్నప్పటి నుంచి చాల సంవత్సరాలు పేదరికంలో మగ్గిపోయిన నటి పోరి మొనీ వయసు రాగానే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి అవకాశాలు దక్కించుకుంది.దీనికి తోడు ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి.దీంతో నటి పోరి మోనీ కి సెలబ్రిటీ హోదా తక్కువ కాలంలోనే దక్కింది.కాగా ప్రస్తుతం నటి పోరి మొనీ దాదాపుగా పది చిత్రాలలో పైగా హీరోయిన్ గా నటిస్తోంది.

కానీ ఉన్నట్లుండి నటి పోరి మొనీ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టు కావడంతో ఈ చిత్రాల భవిష్యత్తు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube