విస్తృత కవరేజీ

ప్రధాని మోదీపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వస్తుండగా విదేశాల్లో మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది.చిన్న దేశాలైతే ఆయన తమ దేశంలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నాయి.

 Bangladesh Media Describes Pm Modi’s Visit As ‘historic’-TeluguStop.com

ఇలాంటి దేశాల్లో మన పొరుగున్న బంగ్లాదేశ్‌ ఒకటి.ఆయన, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లారు.

మోదీ అక్కడ అడుగుపెట్టగానే అక్కడి మీడియా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది.ఆయన పర్యటనను చారిత్రాత్మక పర్యటనగా అభివర్ణించింది.

ఆయన పర్యటనపై బంగ్లా ప్రజలు, ప్రభుత్వం గొప్ప నమ్మకాలు పెట్టుకున్నారని బంగ్లా దినపత్రికలు రాశాయి.ఆయనది అర్థవంతమైన పర్యటనగా ఓ పత్రిక పేర్కొంది.విదేశాలకు వెళ్లినప్పుడు మోదీ అక్కడి ప్రజలను, సర్కారును, మీడియాను సమ్మోహనపరుస్తున్నారు.‘ఇంట్లో ఈగల మోత…బయట పల్లకి మోత’ అన్నట్లుగా మోదీ పరిపాలన.మన్మోహన్‌ సింగ్‌ అసమర్థ ప్రధాని కాగా, మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.మోదీ ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని మన మీడియా కోడై కూస్తోంది.

కాని విదేశీ మీడియా ఇందుకు భిన్నంగా స్పందిస్తోంది.ఏమిటీ మాయాజాలం? ఇది మోదీ బృందం చేస్తున్న ప్రచార మాయాజాలం తప్ప మరేమీ కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube