సమ్మె విరమించారు.. భారత్ వస్తున్నారు

భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు చేపట్టిన సమ్మె ఎట్టకేలకు విరమించారు.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో విబేధాలున్నాయంటూ క్రికెటర్లు చేపట్టిన సమ్మెను బుధవారం అర్ధరాత్రి విరమించినట్లు బంగ్లా టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ తెలిపారు.

 Bangladesh Cricketers Call Off Strike-TeluguStop.com

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో తాము సమావేశమయ్యామని అల్ హసన్ తెలిపారు.బోర్డు ముందు తాము పెట్టిన 11 డిమాండ్లలో 9 డిమాండ్‌లను నెరవేర్చేందుకు బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించారని తెలిపాడు కెప్టెన్.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజును 35 వేల నుంచి లక్ష టకాలకు, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల వేతనాలు 50 శాతం పెంచేందుకు, సహాయ సిబ్బందితో పాటు మైదాన సిబ్బంది వేతనాల పెంపుపై బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Telugu Bangladesh, Cricket, Cricketers, India-

మిగతా సమస్యలను కూడా బీసీబీ త్వరగా పరిష్కరించాలని బంగ్లా క్రికెటర్లు కోరడంతో బీసీబీ సానుకూలంగా స్పందించడంతో.వచ్చే నెలలో భారత టూర్ దాదాపు ఖారారైనట్లే అంటున్నారు క్రీడా నిపుణులు.భారత్ టూర్‌లో భాగంగా బంగ్లాతో రెండు టెస్టులు, మూడీ టీ20 మ్యాచులు జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube