బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంట్లో గ్యాస్ పేలుడు,తృటిలో తప్పిన ప్రమాదం  

Bangladesh Cricketer Liton Das Wife Devasri Cylinder Explosion - Telugu Bangladesh Cricketer, Cylinder Explosion, Gas Cylinder, Liton Das\\' Wife Devasri

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో భారీ గ్యాస్ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది.అయితే తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.

 Bangladesh Cricketer Liton Das Wife Devasri Cylinder Explosion

టీ పెట్టుకోవడానికి అని వంటగదిలోకి వెళ్లిన దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత(27) స్టవ్ ఆన్ చేయడం తో ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో కిచెన్ కేబినెట్ కూలడం తో చేతులకు,ముఖానికి గాయాలు అయినట్లు ఆమె వెల్లడించారు.

అయితే రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకోగా ఈ రోజు వెల్లడించారు.‘చావు వరకు వెళ్లి తప్పించుకున్నాను.

బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంట్లో గ్యాస్ పేలుడు,తృటిలో తప్పిన ప్రమాదం-General-Telugu-Telugu Tollywood Photo Image

చేతులను అడ్డం పెట్టుకోవడం తో ముఖానికి పెద్దగా గాయాలు కాలేదని, లేకపోతే ముఖమంతా కాలిపోయేది అని ఆమె వెల్లడించారు.అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్‌ వాడేసమయంలో చాలా జాగ్రత్తలు పాటించండి అని కూడా ఆమె కోరారు.

2019 వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయాక దాస్, సంచిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి పై పోరాటానికి తన వంతు గా దాస్ బంగ్లా క్రికెట్ బోర్డు తనకిస్తున్న జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు