విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన నౌక!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్ లో పలు చోట్ల రెండు రోజుల నుండి వర్షం కురుస్తుంది.

 Bangladesh Cargo Ship Drifted To Vizag Beach,bangladesh Drifts, Bangladesh Ship,-TeluguStop.com

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది.పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

విశాఖ-నర్సాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.తీరం వెంబడి గంటకు 55-75 km ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండడంతో విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకువచ్చింది.బంగ్లాదేశ్ కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ వీదురుగాలులకు కొట్టుకువచ్చింది.

ఈ 80 మీటర్ ల పొడవాటి నౌక పార్క్లోని రాళ్లలో చిక్కుకుపోవడంతో దాన్ని చూసేందుకు జనాలు తీరానికి వస్తూ ఉన్నారు.నౌక సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.యాంకర్లు రెండూ ధ్వంసం కావడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు, నేవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని నౌక ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube