బంగ్లాదేశ్( Bangladesh ) పర్యటనలో భాగంగా న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మిన్పూర్ వేదికగా రెండు జట్లు మూడో వన్డే మ్యాచ్ లో తలపడుతున్నాయి.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు 34.3 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
బంగ్లాదేశ్ జట్టు 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు జట్టు ఆటగాళ్లయిన ముష్ఫికర్ రహీం 18, నజ్ముల్ హుస్సేన్ శాంటో 76 పరుగులతో జట్టును కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు.

తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం( Mushfiqur Rahim ) విచిత్ర రీతిలో అవుట్ అయ్యాడు.అతను అవుట్ అయిన విధానం చూసి బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 16వ ఓవర్ ను న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేశాడు.
ఈ ఓవర్ లో మొదటి బంతిని ముష్ఫికర్ రహీం డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.బాల్ స్టెప్ పడి వికెట్ల వైపుగా వెళ్ళింది.బాల్ వికెట్లను తగిలితే తాను అవుట్ అవుతానని భావించిన ముష్ఫికర్ బంతిని కాలుతో పక్కకు తన్నే ప్రయత్నం చేశాడు.ఆ ప్రయత్నం విఫలం కావడంతో అవుట్ అయ్యాడు.
బంతి వికెట్లను తాకకుండా పైకి వెళ్ళింది.కానీ ముష్ఫికర్ రహీం కాలు మాత్రం వికెట్లకు తగలడంతో అవుట్ అయ్యి పెవీలియన్ చేరాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( New Zealand ) వేదికగా వైరల్ అయింది.క్రికెట్ లో ఫుట్బాల్ నైపుణ్యాలు అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ముష్ఫికర్ రహీం తన వికెట్ కాపాడుకోవడం కోసం క్రికెట్లో ఫుట్బాల్ నైపుణ్యాలను చూపించి ఘోరంగా విఫలమయ్యాడు.ఇక న్యూజిలాండ్ జట్టు స్వల్ప లక్ష్య చేదన కోసం బరిలోకి దిగింది.