కరోనా తో మృతి చెందిన డిఫెన్స్ సెక్రెటరీ!  

Bangladesh Abdullah Al Moshin Chowdhury Coronavirus - Telugu Abdullah Al Moshin Chowdhury, Bangladesh, Combined Milatariy Hospital, Coronavirus, Dhaka, Intensive Care

కరోనా మహమ్మారి కి ఎందరో బలైపోతున్నారు.రోజు రోజుకు కూడా ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది.

 Bangladesh Abdullah Al Moshin Chowdhury Coronavirus

ప్రతి ఒక్కరి నోట ఈ కరోనా మాటే వినిపిస్తుంది.ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారికి డిఫెన్స్ సెక్రెటరీ మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది.బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోహసిన్ చౌదరి కరోనా వైరస్‌తో సోమవారం మరణించినట్లు సమాచారం.

కరోనా తో మృతి చెందిన డిఫెన్స్ సెక్రెటరీ-General-Telugu-Telugu Tollywood Photo Image

బంగ్లా రక్షణ శాఖ కార్యదర్శి అయిన అబ్దుల్లా తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ లో చేరారు.అయితే అనంతరం ఆయనకు జూన్ 6వతేదీన కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అన్నట్లుగా తేలింది.

ఈ క్రమంలో ఆయన వైద్యం అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అతన్ని జూన్ 18వతేదీన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించినట్లు తెలుస్తుంది.

గత కొద్దీ రోజులుగా ఇంటెన్సివ్ కేర్ లోనే కరోనా కు చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం 9.30 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది.అబ్దుల్లా వయసు 57 సంవత్సరాలు కాగా,ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్లు తెలుస్తుంది.

బంగ్లాదేశ్ లో కూడా కరోనా కేసులు తీవ్రంగానే ఉన్నాయి.ఇప్పటికే ఆ దేశంలో మొత్తంగా 1,37,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా,1,738 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bangladesh Abdullah Al Moshin Chowdhury Coronavirus Related Telugu News,Photos/Pics,Images..

footer-test