అమెరికా పోలీస్..సోషల్ మీడియాలో హీరో అయ్యాడు...!!!  

American Police .. Becomes Hero On Social Media ... !!! - Telugu American Police, Bangetter Highway, Doctor, Jeremy, Nri, Telugu Nri News Updates, అమెరికా పోలీస్

సాధారణంగా నిండు గర్భిణులకు ఏ సమయానికి పురిటి నొప్పులు మొదలవుతాయో చెప్పటం కష్టం.ఒక్కోసారి నెలలు నిండక పోయిన అకస్మాత్తుగా పురిటి నొప్పులు వస్తుంటాయి.

American Police .. Becomes Hero On Social Media ... !!! - Telugu American Police, Bangetter Highway, Doctor, Jeremy, Nri, Telugu Nri News Updates, అమెరికా పోలీస్-Telugu NRI-Telugu Tollywood Photo Image

అప్పటిదాక మాములుగా ఉన్న వారికి కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది.ఇలాంటి పరిస్థితుల్లో హడావుడిగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళే సమయంలో రోడ్ పై ట్రాఫిక్ లో చిక్కుకుపోతే.

ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది కదా.

అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అమెరికాలోని ఉడా ప్రావిన్స్, వెస్ట్ వేలి నగరంలో జెరేమీ అనే వ్యక్తి పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.యధావిధిగా మంగళవారం కూడా అతను ఆ నగరంలో బాంగెట్టర్ హైవేలో విధులు నిర్వర్తిస్తున్న సమయలో ఆ ట్రాఫిక్ లో రెండు కార్లు రోడ్డుకు అడ్డంగా ఉండటాన్ని గమనించాడు.

అదే సమయంలో ఆ వాహనం నుంచి హడావుడిగా బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతోందని చెప్పాడు.పరిస్థితిని అర్ధంచేసుకున్న ఆ పోలీసు అధికారి చేసిన ఓ పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

తన కారులో ఉన్న గ్లౌజులను చేతులకు వేసుకొని, పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళా దగ్గరకి వెళ్లి ఆమెకు ధైర్యం చెబుతూ, ప్రసవం చేశాడు.ఆపై అంబులెన్సును పిలిచి ఆసుపత్రికి కూడా పంపించాడు.దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఓ పోలీసు అధికారి మహిళ కోసం డాక్టర్ అవతరమెత్తడం పై సోషల్ మీడియాతో సహా అంతటా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు

American Police .. Becomes Hero On Social Media ... !!!-bangetter Highway,doctor,jeremy,nri,telugu Nri News Updates,అమెరికా పోలీస్ Related....