మరింత రొమాంటిక్‌గా మారుతున్న బంగార్రాజు

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కాప్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

 Bangarraju To Be More Romantic, Bangarraju, Akkineni Nagarjuna, Ramya Krishna, K-TeluguStop.com

అయితే గతకొంత కాలంగా సరైన హిట్ లేక నాగ్ సతమతమవుతున్నాడు.ఆయన కెరీర్‌లో సోగ్గాడే చిన్ని నాయన ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

మళ్లీ అలాంటి హిట్ ఇప్పటివరకు నాగ్ అందుకోకపోవడంతో అక్కినేని అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

అయితే సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, అప్పటి నుండి నాగ్‌తో బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు.అయితే కథలో చాలా మార్పులు చేయాలంటూ నాగ్ సూచించడం, అందుకు అనుగుణంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మార్పులు చేస్తుండటంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇక ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర చాలా రొమాంటిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.సోగ్గాడే చిత్రంతో పోలిస్తే, బంగార్రాజు చిత్రంలో నాగ్ రొమాంటిక్ యాంగిల్ మరో రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అటు అందాల భామ రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో చాలా గ్లామరస్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే ఈ సినిమను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నాగ్ తీవ్రంగా కష్టపడుతున్నాడు.మరి బంగార్రాజు రొమాన్స్ ఏరేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube