బంగార్రాజు ఈసారైనా పట్టాలెక్కేనా?  

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ్, ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

TeluguStop.com - Bangarraju Movie To Start In December

కాగా నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నాగ్ పాత్ర బంగార్రాజు ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నాగ్ నటనకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాలోని బంగార్రాజు పాత్ర పేరుతో ఓ సినిమా తీయబోతున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

అయితే ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో నాగ్ మరోసారి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.

TeluguStop.com - బంగార్రాజు ఈసారైనా పట్టాలెక్కేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా స్క్రిప్టు పనులు ఎప్పుడో పూర్తికాగా ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు.పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు పట్టాలెక్కించేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ నెలలో పట్టాలెక్కించాలని ఆయన చూస్తున్నాడు.అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు.

మరి ఈసారైనా బంగార్రాజు అనుకున్న సమయానికి పట్టాలెక్కుతాడా లేక మరోసారి వాయిదా వేస్తాడా అనేది చూడాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో నాగ్‌తో పాటు రమ్యకృష్ణ, రష్మిక మందన నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి బంగార్రాజు చిత్రం కూడా సోగ్గాడే చిన్ని నాయన లాగా అదిరిపోయే హిట్ అందుకుంటుందా లేదా అనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుంది.ఈ సినిమాను నాగ్ స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్నట్లు గతంలోనే వెల్లడించాడు.

#Kalyan Krishna #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు