బంగార్రాజు కోసం వస్తున్నా అనూప్ రూబెన్స్

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

 Bangarraju Movie Music Sitting Starts, Tollywood, Telugu Cinema, South Cinema, A-TeluguStop.com

ఈ సినిమా తర్వాత తన సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజుని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఇందులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించబోతున్నారని టాక్ కూడా ఉంది.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకున్న లాక్ డౌన్, కరోనా కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితిలోను ఆగష్టులో సినిమా స్టార్ట్ చేయాలని నాగార్జున భావిస్తున్నారు.

త‌క్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్.ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ సెలక్షన్ జరుగుతుందని తెలుస్తుంది.రమ్యకృష్ణ, నాగార్జున పాత్రలు కొనసాగింపుగా ఉంటాయని, మిగిలిన పాత్రలలో కొత్త వారు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.త్వరలో క్యాస్టింగ్ గురించి అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు టాక్.

ఇదే సమయంలో తమ ఫ్యామిలీకి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ని సంగీత దర్శకుడుగా తీసుకోవడంతో పాటు అతనితో ట్యూన్స్ కూడా సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక అక్కినేని ఫ్యామిలీకి రెండు హిట్స్ ఇచ్చిన నేల టికెట్ సినిమాతో ఫ్లాప్ కొట్టడంతో ఇప్పుడు కచ్చితంగా బంగార్రాజు రూపంలో హిట్ కొట్టాల్సి ఉంటుంది.

ఇక కింగ్ నాగార్జున కూడా ఈ సీక్వెల్ తో సాలిడ్ హిట్ కొట్టాలని దర్శకుడుని ఎక్కువగా వర్క్ చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube