వచ్చే ఏడాది సంక్రాంతికి బంగార్రాజు, ఇది ఫైనల్‌.. ఫుల్‌ డీటైల్స్‌ ఇదుగో

మూడు సంవత్సరాల క్రితం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రం వచ్చింది.నాగార్జున ద్వి పాత్రాభినయం చేసిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.

 Bangarraju Movie Goes Final For Next Sankranthi-TeluguStop.com

నాగార్జున కెరీర్‌ లో నిలిచి పోయే సక్సెస్‌ను దక్కించుకున్న ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని బంగార్రాజు పాత్రకు మంచి స్పందన వచ్చింది.

దాంతో ఆ పాత్రను బేస్‌ చేసుకుని కథను సిద్దం చేయాల్సిందిగా మూడు సంవత్సరాల క్రితమే కళ్యాణ్‌ కృష్ణకు నాగార్జున చెప్పాడు.అప్పటి నుండి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఎన్నో కథలను తీసుకు వచ్చాడు.

కాని నాగ్‌ కు మాత్రం ఏది నచ్చలేదు.ఎట్టకేలకు నాగార్జునను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మెప్పించాడు.

నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర చుట్టు ఒక కథను అల్లిన దర్శకుడు ఆ కథను నాగార్జున రెండు పాత్రల్లో కాకుండా, నాగచైతన్య ఒక పాత్రలో నాగార్జున మరో పాత్రలో చేస్తే బాగుంటుందని సూచించాడట.అందుకు నాగార్జున కూడా ఒప్పేసుకున్నాడు.కథ బాగుండటంతో పాటు, తన పాత్రకు ప్రాముఖ్యం ఉండటం, అది కూడా నాన్నగారితో కలిసి నటించే అవకాశం రావడంతో నాగచైతన్య మారు మాట్లాడుకుండా సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట.అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కాబోతుంది.

సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది.త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్‌ పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ చిత్రంను కూడా తప్పకుండా సంక్రాంతికే విడుదల చేయాలనే పట్టుదలతో నాగార్జునతో పాటు దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ చెప్పుకొచ్చాడు.మొత్తానికి బంగార్రాజు వచ్చే సంక్రాంతికి కుమ్మేస్తాడేమో చూడాలి.

అయితే మొన్ననే సంక్రాంతి పోయింది కనుక మళ్లీ సంక్రాంతి అంటే సంవత్సరం పాటు బంగార్రాజు కోసం వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube