ఇండస్ట్రీకి నువ్వు పనికిరావు.. వెళ్ళిపో అన్నారు : కళ్యాణ్ కృష్ణ

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేవారు ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే.అయితే ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంతోమంది పాత జ్ఞాపకాలను కొన్నిసార్లు గుర్తుచేసుకోవడం చేస్తూ ఉంటారు.

 Bangarraju Movie Director Kalyan Krishna Career Struggles Details, Bangarraju Mo-TeluguStop.com

ఇప్పుడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అంటూ చెబుతున్నాడు.సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాతో నాగార్జునతో సినిమా తీసి హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా చివరికి నిరాశ ఎదురైంది.

కలిసొచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసి ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈసారి నాగార్జునతో పాటు అక్కినేని నాగచైతన్య ను కూడా కలుపుకొని బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ.

ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అవమానాలు ఇబ్బందులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

Telugu Bangarraju, Kalyan Krishna, Duty, Naga Chaitanya, Nagarjuna, Soggadechinn

కెరియర్ మొదట్లో ఓ సినిమాకి అప్రెంటీస్ గా పనిచేసాడట కళ్యాణ్ కృష్ణ.షూటింగ్ పూర్తయి డబ్బింగ్ మొదలైన తర్వాత ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నాడట కళ్యాణ్ కృష్ణ.ఆ సమయంలో డబ్బింగ్ కి నువ్వు రావాల్సిన పనిలేదు అంటూ చెప్పినప్పటికీ డబ్బింగ్ రూమ్ దగ్గర వారం రోజుల పాటు నిలబడి ఉన్నాడట.ఆ సమయంలో నిర్మాత ఇక్కడ ఎందుకు నిలబడ్డావు లోపలికి రా అంటూ పిలవడంతో కళ్యాణ్ కృష్ణ లోపలికి వెళ్ళాడు.

Telugu Bangarraju, Kalyan Krishna, Duty, Naga Chaitanya, Nagarjuna, Soggadechinn

ఈ క్రమంలోనే అక్కడ లైట్ మెన్ చేసే పని చెప్పగా.4 గంటల పాటు నిలబడి లైట్ మెన్ డ్యూటీ చేసినా కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత కాళ్ళ నొప్పి రావడంతో కుర్చీలో కూర్చున్నారట.ఆ సమయంలో నిర్మాత అక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావ్.ఆమాత్రం సహనం లేకపోతే.ఇండస్ట్రీలో నువ్వు పనికిరావు వెళ్ళిపో అంటూ అనడంతో కళ్యాణ్ కృష్ణ ఎంతగానో ఫీలయ్యారట.అయితే అప్పుడు అలా అన్న నిర్మాత ఇప్పటికి కూడా టచ్లో ఉన్నాడు అంటూ కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube