అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా….. కానీ  

Bangaram movie fame Sanusha react about depression situation, Sanusha, Bangaram movie fame, Telugu actress, Depression, Tollywood,  - Telugu Bangaram Movie fame, Bangaram Movie Fame Sanusha React About Depression Situation, Depression, Sanusha, Telugu Actress, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన “బంగారం” అనే చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించి నటిగా సినిమా పరిశ్రమకు పరిచయమైన “మళయాల కుట్టి సనుష” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో సనుష ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.

TeluguStop.com - Bangaram Movie Fame Sanusha React About Depression Situation

ఆ తర్వాత తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి “జెర్సీ” చిత్రంలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది.అయితే తాజాగా సనుష మానవ జీవితంలో డిప్రెషన్ ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా మన జీవితాల్లో డిప్రెషన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని , అయితే మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పుకొచ్చింది. అంతే గాక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని అంతేగాక మన మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలని తెలిపింది.

TeluguStop.com - అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా….. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఒకానొక సమయంలో తాను కూడా ఈ డిప్రెషన్ కి లోనయ్యానని ఈ క్రమంలో పరిస్థితులను అదుపు చేయలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ తన కుటుంబ సభ్యులకు మరియు వైద్యుల సలహా మేరకు తొందరగా కోలుకున్నానని తెలిపింది.

అయితే ఈ  విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు తెలుగులో సనుష బంగారం, జీనియస్, జెర్సీ తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి.

 కానీ ఈ అమ్మడుకి మలయాళం, తమిళం, తదితర భాషలలో సినిమా అవకాశాలు ఎక్కువ రావడంతో తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయింది.కాగా ప్రస్తుతం మలయాళంలో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం….

#BangaramMovie #Depression #Sanusha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bangaram Movie Fame Sanusha React About Depression Situation Related Telugu News,Photos/Pics,Images..