నిత్యానందపై అరెస్ట్ వారెంట్ జారీ!  

Bangalore Local Court Pass Arrest Warrant On Nithyananda - Telugu Arrest Warrant On Nithyananda, Bangalore Local Court, Kailash Country, Karnatana

నిత్యానంద ఈ పేరు దేశంలోని ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.అయితే ఈ మధ్య కాలంలో అతను ఓ ఐలాండ్ కొని దానిని ప్రత్యేక దేశంగా తనకి తానే ప్రకటించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Bangalore Local Court Pass Arrest Warrant On Nithyananda - Telugu Kailash Country Karnatana

వాటిని బలపరిచే విధంగా నిత్యానంద దేశం పేరు కైలాష్ అని, ఇక ఆ దేశానికి కాషాయం జాతీయ జెండా అని ఆ దేశంలో పౌరసత్వం తీసుకోవాల్సిందిగా నిత్యానంద సందేశం బయటకి వచ్చింది.దీంతో నిత్యానంద గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వినిపించాయి.

అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం కావడంతోనే దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అయితే నిత్యానంద దేశం విడిచి వెళ్లలేదని ఆశ్రమంలోనే ఉన్నారని అతని శిష్యులు ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు.

దీని ఆధారంగా స్వామి నిత్యానందపై బెంగుళూరులోని స్థానిక రామనగర కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై అరెస్ట్ వారెంట్‌ జారీ చేసిన మేజిస్ట్రేట్ సిద్దలింగప్ప ప్రభు బెయిల్ షరతుల ఉల్లంఘన, సెక్యూరిటీ డిపాజిట్ రికవరీకి సంబంధించి నిత్యానందపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

నిత్యానందని అరెస్ట్ చేసిన తమ ఎదుట హాజరు పరచాలని తెలిపారు.

తాజా వార్తలు