ఏంటి…. రష్మి డబ్బు కోసం ఇలాంటి పని చేశావా…?

ఈ మధ్య కాలంలో డబ్బు కోసం కొంతమంది ఎంతటి అఘాయిత్యానికి అయినా పాల్పడుతున్నారు.కాగా తాజాగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఓ వైద్యురాలు డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రుల నుంచి అభం శుభం తెలియని శిశువును వేరు చేసి అమ్మేసుకుని సొమ్ము చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Bangalore Doctor Rashmi Sell Small Kid For Money In Bangalore-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే రష్మి అనే వైద్యురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.కాగా గత కొద్ది కాలంగా డాక్టర్ రష్మి స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందిస్తోంది.

ఈ క్రమంలో ఓ వ్యక్తి తన భార్యని కాన్పు నిమిత్తమై రష్మి పనిచేస్తున్న ఆసుపత్రి లో చేర్పించాడు.అయితే కాన్పు జరిగిన రోజున వీరికి పుట్టిన శిశువు కనబడకుండా పోయింది.

 Bangalore Doctor Rashmi Sell Small Kid For Money In Bangalore-ఏంటి…. రష్మి డబ్బు కోసం ఇలాంటి పని చేశావా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో శిశువు తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించారు.అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుండగా ఇటీవలే పోలీసులు ఈ కేసును ఛేదించారు.

కాగా ఇటీవలే పోలీసులు సీసీ పూటేజీలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ డాక్టర్ రష్మిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.పోలీసుల విచారణలో డాక్టర్ రష్మి కూడా 16 లక్షల రూపాయల డబ్బు కోసం అప్పుడే జన్మించిన చిన్నారిని దొంగలించి వేరే వారికి అమ్మేసినట్లు నేరం ఒప్పుకుంది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారి ప్రాణాలను కాపాడాల్సిన  వైద్యులే ఇలాంటి ఘాతుకాలకి పాల్పడితే వైద్య వృత్తికే కళంకం వస్తుందని కాబట్టి వైద్యురాలిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

#BangaloreDoctor #Rashmi #Bangalore #Karnataka #BangaloreDoctor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు