డ్రగ్స్ వ్యవహారంలోకి బాలీవుడ్ హీరో భార్య… నోటీసులు  

Bangalore city crime branch serves Notice to Vivek oberoi wife Vivek Oberai, Priyanaka, Sushanth Singh Rajputh, AAditya Alwa, Bengaloore, Karnataka Police - Telugu Aaditya Alwa, Bengaloore, Karnataka Police, Priyanaka, Sushanth Singh Rajputh, Vivek Oberai

డ్రగ్స్ వ్యవహారం అటు బాలీవుడ్,శాండల్ వుడ్ లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పటికే బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడగా, మరోపక్క కన్నడ ఇండస్ట్రీ లో కూడా డ్రగ్స్ వ్యవహారం బయటపడడం తో ఇప్పటికే హీరోయిన్లు రాగిణి ద్వివేది,సంజనా గాల్రానీ సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం విదితమే.

TeluguStop.com - Bangalore City Crime Branch Serves Notice To Vivek Oberoi Wife

అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ హీరో భార్య మెడకు కూడా చుట్టుకుంది.ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు అని అనుకుంటున్నారా.

మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్.ఆయన సతీమణి ప్రియాంక కు కూడా బెంగుళూరు పోలీసులు నోటీసులు అందించినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - డ్రగ్స్ వ్యవహారంలోకి బాలీవుడ్ హీరో భార్య… నోటీసులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దివంగత మాజీ కర్ణాటక మంత్రి జీవరాజ్ ఆళ్వా కుమారుడు, వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా కు డ్రగ్స్ వ్యవహారం తో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది.డ్రగ్ వ్యవహారం కేసులోని 12 మంది ప్రధాన నిందితుల్లో ఆదిత్య అల్వా కూడా ఉన్నట్లు సీసీబీ వెల్లడించింది.

అయితే ప్రస్తుతం పరారీ లో ఉన్న ఆదిత్య ను పట్టుకొనే ప్రయత్నంలో సోదరి ప్రియాంక ఇంట్లో దాక్కున్నాడనే అనుమానంతో ముంబైలోని వివేక్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది.అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం లో ఆదిత్య తో పాటు ప్రియాంకకు కూడా సంబంధాలు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఆమెకు కూడా ఈరోజు నోటీసులు అందించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపుల్లో భాగంగా గురువారం ముంబయిలోని వివేక్ ఒబెరాయ్ నివాసంలో సోదాలు నిర్వహించాల్సి వచ్చింది.

ఆదిత్యను పట్టుకునే చర్యల్లో భాగంగా కోర్టు వారెంట్‌తోనే పోలీసులు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు చేసినట్లు తెలుస్తుంది.బెంగళూరులోని కాటన్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్లో ఆదిత్యపై కేసు నమోదు కాగా అతడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు

.

#Bengaloore #Vivek Oberai #Priyanaka #AAditya Alwa #SushanthSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bangalore City Crime Branch Serves Notice To Vivek Oberoi Wife Related Telugu News,Photos/Pics,Images..