బెంగళూరులో అక్రమ నిర్మాణాలపై కొరడా... ఆస్తులు కొనాలంటే వణుకుతోన్న ఎన్ఆర్ఐలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారత ఐటీ రాజధాని బెంగళూరులో అనేక ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అయితే చెరువుల కబ్జా, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కారణంగానే నగరం ఈ స్థాయిలో విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు.

 Bangalore City Administration Demolition Drive Worries Nri Property Buyers , N-TeluguStop.com

ఈ నేపథ్యంలో బెంగళూరు నగరపాలక సంస్థ రంగంలోకి దిగింది.అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.

ఈ చర్యలు నగరంలో పెట్టుబడులు పెట్టేవారిని, ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్‌ని ఉలిక్కిపడేలా చేసింది.

దీనిపై యూఏఈకి చెందిన ప్రవాస భారతీయుడు వినిత్ టోయిలా మాట్లాడుతూ.

నగరంలో నిబంధనలకు అనుగుణంగా లేని ఆస్తుల కూల్చివేతకు సంబంధించిన వార్తలు చూస్తున్నామన్నారు.ఇవి తమకు భయాందోళన కలిగిస్తోందని.

ఎందుకంటే భారత్‌లో ఏం జరుగుతుందో తమకు తెలియదని వినిత్ ఆవేదన వ్యక్తం చేశారు.యూఏఈకే చెందని సౌరభ్ కుమార్ మాట్లాడుతూ… అక్రమ ఆస్తుల కూల్చివేత ఘటనలు తమకు ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు.

ఈ తరహా ఇబ్బందులను నివారించడానికి ఆస్తుల కొనుగోలుకు ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సౌరభ్ అభిప్రాయపడ్డారు.సౌరభ్ తాను ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్‌కు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) అనుమతులు వున్నాయో లేదో తెలుసుకోవడంతో పాటు చుట్టుపక్కల వున్న వారిని కూడా ఆరా తీసేవాడినని తెలిపాడు.

Telugu Bangalore, Bangaloredrive, Indian, Estate, Vinit Toila-Telugu NRI

కోవిడ్ 19కి ముందు ఆస్తులపై పెట్టుబుడలు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు పెద్దగా ఆసక్తి చూపలేదని హోమ్లీ యువర్స్ వ్యవస్థాపకుడు అలోక్ ప్రియదర్శి అన్నారు.అయితే కరోనా ఈ పరిస్ధితిని మార్చిందని.భారత్‌లో రియాల్టీ హబ్‌గా వున్న బెంగళూరులో ఆస్తులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎన్ఆర్ఐలు ఆసక్తిని కనబరుస్తున్నారని అలోక్ ప్రియదర్శి తెలిపారు.అదే సమయంలో ఎన్ఆర్ఐ పెట్టుబడులలో 150 శాతం పెరుగుదల కనిపించిందని.

గతంలో ప్రవాస భారతీయులు 500 ఆస్తులను కొనుగోలు చేస్తే, ఇప్పుడు వీటి సంఖ్య 1,500 వరకు పెరిగిందన్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ప్రాపర్టీ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని అలోక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్ధితిని చూసి కొనుగోలుదారులు భయపడుతున్నారని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube