టిఆర్ఎస్ మంత్రుల పై సీరియస్ కామెంట్లు చేసిన బండి సంజయ్..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట లోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా యునెస్కో గుర్తించటం తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాకతీయ కాలంనాటి నాగరికత ప్రపంచానికి తెలిసేలా గుర్తింపు రావడంతో టీఆర్ఎస్ మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించి కేసీఆర్ కృషి వల్లే ఈ గుర్తింపు వచ్చినట్లు చెప్పు కు రావడం జరిగింది.

 Bandy Sanjay Made Serious Comments On Trs Ministers Bandy Sanjay, Trs, Trs Minis-TeluguStop.com

పదేపదే కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం లేఖలు రాయటం వల్ల రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించినట్లు టిఆర్ఎస్ మంత్రులు స్పష్టం చేశారు.

ఇటువంటి తరుణంలో తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కృషి వల్ల ఈ గుర్తింపు వచ్చిందని టిఆర్ఎస్ మంత్రులు ప్రచారం చేయడం సిగ్గుచేటు అంటూ సీరియస్ కామెంట్లు చేశారు.అదే రీతిలో నీకు గుర్తింపు రావడానికి గల కారణం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల ఈ ఖ్యాతి దక్కినట్లు స్పష్టం చేశారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు మంచి క్యాతి తెచ్చారని బహుమతి ఇచ్చారని.స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube