ఇంటర్వ్యూయర్ దెబ్బకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోతా అన్న 'బండ్ల గణేష్'.! అసలేమైందంటే.?   Bandla Ganesh Walked Out Of Live Show     2018-10-04   09:40:46  IST  Sainath G

కమెడియన్‌ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్. ఇప్పుడు ప్రొడ్యూసర్‌ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గణేష్.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రెడి అవుతున్నారు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు. గతంలో చాలా వేడుకల్లో కూడా పవన్ భక్తుడిలాగా మాట్లాడి అభిమానాన్ని చాటుకున్నారు. బండ్ల గణేష్ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడు.

మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో బండ్ల గణేష్ చేరొచ్చు కదా.? అని పవన్ ఫాన్స్ కి డౌట్. పైగా జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీనిపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటె…టీవీ 5 ఇంటర్వ్యూలో మూర్తి అడిగిన ప్రశ్నలకు బండ్ల గణేష్ ఏం సమాధానం చెప్పాలో అర్దమవ్వక అక్కడినుండి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అడగగానే వెళ్ళిపోయాడు. అంతేకాదు ఇటీవలే మరొక ఇంటర్వ్యూలో ఎక్కడినుండి పోటీ చేసిన తప్పక గెలుస్తా అని అతినమ్మకంతో చెప్పాడు బండ్ల గణేష్. ఆ వీడియో మీరే చూడండి!

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.