పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ వైరల్ కామెంట్స్...

నిర్మాత బండ్ల గణేష్ తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.ఒక కమెడియన్ గా సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా నిర్మాతగా మారిన తర్వాత సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

 Bandla Ganesh Viral Comments On Pawan Kalyan,pawan Kalyan, Producer Bandla Ganes-TeluguStop.com

తరువాత నిర్మాతగా మారిన తరువాత పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారి టాలీవుడ్ బడా నిర్మాతలలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం చూసాం.

ఇది ఒక వైపు అయితే పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పాటల కోసం కన్నా బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురుచూస్తారంటే అభిమానులలో బండ్ల గణేష్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఐతే ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తే బండ్ల గణేష్ ఈసారి రూటు మార్చి పవన్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.పవన్ అన్న రావాలి…పాపలు పోవాలి అని బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు.

అయితే ఈ వ్యాఖ్యలు వెనుక ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది తెలియరాలేదు.ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube