తప్పు చేసి దొరికిపోయిన బండ్ల గణేష్.. జనసేనపై షాకింగ్ కామెంట్లు చేస్తూ?

పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కోట్ల సంఖ్యలో ఉంది.సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

 Bandla Ganesh Tweets Goes Viral In Social Media, Actor Bandla Ganesh , Goes Vira-TeluguStop.com

పవన్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు లేకపోయినా పాన్ ఇండియా హీరోల స్థాయిలో పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.జనసేన పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమాని అయిన బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ లో చేసిన చిన్న పొరపాటు వల్ల నెటిజన్లు బండ్ల గణేష్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.బండ్ల గణేష్ తన ట్వీట్ లో “ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక గొప్ప శక్తిగా అవతరించిన పోతుంది” అంటూ బండ్ల గణేష్ మొదట ట్వీట్ చేశారు.

అయితే చివరి రెండు పదాలు తప్పుగా ఉండటంతో నెటిజన్లు బండ్ల గణేష్ ను ట్రోల్ చేశారు.

ఆ తర్వాత బండ్ల గణేష్ తప్పును సరిదిద్దుకుని “తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మహాశక్తిగా అవతరించబోతుంది” అంటూ బండ్ల గణేష్ అప్పటికే తప్పును సరిదిద్దుకున్నారు.అయితే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అప్పటికే వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ట్వీట్ గురించి తమదైనశైలిలో కామెంట్లు చేశారు.మరోవైపు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది.

గత కొన్నిరోజుల నుంచి ప్రచారంలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.పవన్ మూవీ కొత్త టైటిల్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తర్వాత తెరకెక్కనున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube