అయ్యో బండ్ల గణేష్.. దిల్ రాజు తండ్రైతే మరో నిర్మాత కంగ్రాట్స్ చెప్తే ఎలా?

బండ్ల గణేష్ ఎప్పుడు ఎవరిపై ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో ఎవరికి తెలియదు.ఈయన మైక్ పట్టుకున్నారంటే చాలు ఇండస్ట్రీలో ఈయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతాయి.

 Bandla Ganesh Trolled Again Over His Wishes To Dil Raju Blessed With A Baby Boy, Bandla Ganesh, Dil Raju, Social Media, Trolls,tollywood, Dil Raju Blessed With A Baby Boy-TeluguStop.com

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ కుమారుడు నటించిన చోర్ బజార్ సినిమా వేడుకలో భాగంగా పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు మరోసారి తండ్రి అయిన సంగతి మనకు తెలిసిందే.ఈయన రెండవ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Bandla Ganesh Trolled Again Over His Wishes To Dil Raju Blessed With A Baby Boy, Bandla Ganesh, Dil Raju, Social Media, Trolls,tollywood, Dil Raju Blessed With A Baby Boy-అయ్యో బండ్ల గణేష్.. దిల్ రాజు తండ్రైతే మరో నిర్మాత కంగ్రాట్స్ చెప్తే ఎలా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సైతం దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ దిల్ రాజుకు ట్యాగ్ చేయకుండా మరో నిర్మాతకు ట్యాగ్ చేశారు.

ఇక దిల్ రాజుకు చేయబోయి మరొక నిర్మాతకు ఈయన విషెస్ తెలియజేయడంతో నేటిజన్స్ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.దిల్ రాజు అన్న కంగ్రాట్స్ అంటూ ఓ బాణం, స్కేటింగ్, కప్పులను ఎమోజీలుగా పెడుతూ SVCC ఖాతాని ట్యాగ్ చేశారు.

నిజానికి దిల్ రాజు నిర్మాణ సంస్థ SVC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్.

బండ్ల గణేష్ ట్యాగ్ చేసిన SVCC (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర) బ్యానర్ సీనియర్ నిర్మాత బీవీయస్ యన్ ప్రసాద్ గారిది కావడంతో ఎంతోమంది నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు.ఏంటిది బండ్లన్న తండ్రి అయినది దిల్ రాజు అయితే.మీరు బివిఎన్ఎస్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? ఏదైనా ట్వీట్ చేసేముందు ఒకసారి చూసుకోవాలి కదా బండ్లన్న అంటూ పెద్ద ఎత్తున నేటిజన్ లు బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు.ఒకవేళ పొరపాటున ఈ ట్వీట్ చేసిన తర్వాత అయినా డిలీట్ చేయాలి కదా.ఇలా అయితే ఎలా బండ్లన్న అంటూ బండ్ల గణేష్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube