సరిలేరు నీకెవ్వరులో బ్లేడు బాబ్జీకి కత్తెర  

Bandla Ganesh Track In Sarileru Neekevvaru To Be Replaced - Telugu Anil Ravipudi, Bandla Ganesh, Rashmika Mandanna, Sarileru Neekevvaru, Vijayashanti

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటిందని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Bandla Ganesh Track In Sarileru Neekevvaru To Be Replaced

కాగా ఈ సినిమాలో ట్రెయిన్ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్ కామెడీతో రెచ్చిపోయి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

కానీ అది అంతగా వర్కవుట్ కాలేదని చెప్పాలి.ఈ ట్రెయిన్ ఎపిసోడ్‌లో హీరోయిన్ కుటుంబం, మహేష్‌ల మధ్య కామెడీయే సూపర్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ఇది తెలుసుకున్న చిత్ర యూనిట్ బ్లేడ్ బాబ్జీ, అదేనండీ బండ్ల గణేష్ సీన్‌ను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

బండ్ల గణేష్ కామెడీతో అలరిస్తాడని, అది సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఆయన సీన్స్‌ను ఎత్తేయనున్నారు.

మొత్తానికి ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లి పరువు పోగొట్టుకున్న బండ్ల గణేష్‌, సరిలేరు నీకెవ్వరు సినిమాలో అదిరిపోయే రోల్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా డప్పు కొట్టింది.తీరా ఇప్పుడు ఉన్న రోల్‌ను కూడా తీసేస్తుండటంతో మరోసారి బండ్ల పరువు పోయిందని అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు

Bandla Ganesh Track In Sarileru Neekevvaru To Be Replaced-bandla Ganesh,rashmika Mandanna,sarileru Neekevvaru,vijayashanti Related....