నారా లోకేష్ ని జూ.ఎన్టీఆర్ లాగా ఎదగాలంటున్న బండ్ల గణేష్...

తెలుగులో ఒకప్పుడు చిన్న చిన్న కమెడియన్ పాత్రలు చేస్తూ ఆ మధ్య కాలంలో ఏకంగా సినీ నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరియు ప్రముఖ సినిమా సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.కాగా ఇతడు సినిమాల్లోనే కాకుండా గతంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం పాటు  కాంగ్రెస్ పార్టీకి తన సేవలను కూడా అందించాడు.

 Bandla Ganesh, Tollywood Movie Producer, Actor, Nara Lokesh, Tdp, Jr Ntr, Tollyw-TeluguStop.com

అయితే పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య కాలంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.

 తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో, రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం కానీ అది చాలా కష్టమని వదిలేసాను.

రాజకీయాల్లో వారసత్వం కాదు దమ్ము, ధైర్యం, ప్రజల్లో నమ్మకం పోరాడుతాడనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణం. ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కె అదృష్టం మీకు దక్కటం నిజంగా మీ అదృష్టం చంద్రబాబు నాయుడు కుమారుడు గా మీరు పుట్టటం.

రాజకీయ పార్టీ అంటే సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు. మన పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకొని ప్రజలకు సేవ చేయాలని అనుకుంటాను.

మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ మధ్య ట్విట్టర్ లో మీరు చేస్తున్న కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడే చాలామంది బాధపడుతున్నారు.

మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయ ఉండాలని మీరు ఆ విధంగా ప్రజా పోరాటం లో భాగం కావాలని కోరుకుంటున్నాను.

అలాగే చంద్రబాబు నాయుడు లాగా పని చేసి ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కొడుకు కేటీఆర్ ను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.

అంతేకాక గౌరవనీయులైన చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమర్థవంతంగా పోరాడారని పొగడ్తలతో ముంచెత్తాడు.ఎటువంటి సపోర్ట్ లేకుండా నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు కూడా ఉండాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తనకు తన తండ్రి చంద్రబాబు నాయుడు, మరియు తన తాత నందమూరి తారక రామారావు అంటే ఎనలేని అభిమానమని చెప్పుకొచ్చాడు.అంతేగాక చివర్లో మీకు చంద్రబాబు నాయుడు కుమారుడిగా తప్ప ఎటువంటి రాజకీయ అర్హత లేదంటూ ఎద్దేవా చేశాడు.

ప్రస్తుతం బండ్ల గణేష్ చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరోపక్క తెలుగు తమ్ముళ్లు మాత్రం బండ్ల గణేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube