పవన్ కోసం బండ్లన్న కథ రెడీ!  

Bandla Ganesh Story Ready For Pawan Kalyan, Bandla Ganesh, Pawan Kalyan, PSPK30, Tollywood News - Telugu Bandla Ganesh, Pawan Kalyan, Pspk30, Tollywood News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు పవన్.

TeluguStop.com - Bandla Ganesh Story Ready For Pawan Kalyan

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమా తరువాత మరో సినిమాను ఓకే చేసి పవన్ అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమాను చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పవన్‌తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

దీని కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా పవన్ కోసం ఓ అదిరిపోయే కథ రెడీ అయ్యిందని, త్వరలోనే ఈ కథను పవన్‌కు వినిపించనున్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.

ఈ సినిమాలో పవన్ చాలా వైవిధ్యమైన పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో పవన్ ఓ లెక్చరర్ పాత్రలో మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు.దీంతో ఈ సినిమాను ఎవరు తెరకెక్కించనున్నారా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది.

మరి బండ్లన్న చెప్పబోయే కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

#Pawan Kalyan #PSPK30 #Bandla Ganesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandla Ganesh Story Ready For Pawan Kalyan Related Telugu News,Photos/Pics,Images..