బండ్లన్న సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది  

Bandla Ganesh Special Role In Sarileru Nikevvaru -

గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని ఆ తరువాత వ్యాపారాలతో హ్యాపీ లైఫ్ ను సెట్ చేసుకున్న బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్ పై క్లారిటీ వచ్చేసింది.గతంలో ఎన్నో సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ చాలా రోజులతో తెరపై కనిపించబోతున్నాడు.

Bandla Ganesh Special Role In Sarileru Nikevvaru

అతను నటనకు దూరంగా ఉంటున్నాడు అని కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బండ్లన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ తో మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది.సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో బండ్ల గణేష్ సీరియస్ గా కనిపిస్తూనే నవ్విస్తాడని టాక్.

ఆయన పాత్ర ఎలాంటిదనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని సినిమాలో బండ్ల గణేష్ కనిపించడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో బండ్ల గణేష్ ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.అలాగే ఈ నటుడు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఒకే చేసినట్లు తెలుస్తోంది.

బండ్లన్న సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది-Movie-Telugu Tollywood Photo Image

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandla Ganesh Special Role In Sarileru Nikevvaru- Related....