జీవితంలో వాటిజోలికి వెళ్లను.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్..?

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో పాటు పవన్ ను తరచూ ప్రశంసలతో ముంచెత్తే బండ్ల గణేష్ త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.మరోవైపు బండ్ల గణేష్ నటుడిగా బిజీ అవుతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 Bandla Ganesh Sensational Comments Abotu Politics-TeluguStop.com

ఇటీవలే మరోసారి కరోనా బారిన పడి కోలుకుంటున్న బండ్ల గణేష్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ కావాలనే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు.

 Bandla Ganesh Sensational Comments Abotu Politics-జీవితంలో వాటిజోలికి వెళ్లను.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రాజకీయాలు తనకు సూట్ కావని అర్థం చేసుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టారు.నిన్న 5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ కు శుభాకాంక్షలు చెప్పారు.బండ్ల గణేష్ శుభాకాంక్షలు చెప్పడంతో కొందరు నెటిజన్లు గణేష్ ను మమతా బెనర్జీ పార్టీలో చేరతావా అని ప్రశ్నించారు.

అయితే ఆ ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానమిస్తూ ఇక తన లైఫ్ లో రాజకీయాలు ఉండవని స్పష్టతనిచ్చారు.భవిష్యత్తులో కూడా బండ్ల గణేష్ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశమే లేదని స్పష్టత వచ్చినట్టేనని చెప్పవచ్చు.

అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే మాత్రం బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకునే అవాకాశం ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ ప్రముఖులకు ఎక్కువగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి.

కమల్ హాసన్ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయగా తనతో పాటు పోటీ చేసిన వాళ్లు సైతం ఓడిపోయారు.రాబోయే రోజుల్లో సినిమా సెలబ్రిటీలు రాజకీయలపై ఆసక్తి చూపే అవకాశాలు తగ్గే అవకాశం ఉంది.

#Mamata Benarjee #Bandla Ganesh #Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు