బండ్ల గణేష్‌ రాజకీయాలకు గుడ్‌ బై... కారణం ఇదేనట  

Bandla Ganesh Says Goodbye To Congress Party-bandla Ganesh Goodbye To Politics,t Congress,telugu Viral News,tollywood Updates,viral In Social Media

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌లో జాయిన్‌ అయిన నిర్మాత బండ్ల గణేష్‌ ఎంతటి హడావుడి చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే బ్లేడ్‌ తో గొంతు కోసుకుంటాను అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం, టీఆర్‌ఎస్‌ నాయకులను ఇష్టం వచ్చినట్లుగా దూషించడం చేశాడు. దాంతో మీడియాలో బండ్ల గణేష్‌ ఆ నెల రోజులు తెగ సందడి చేశాడు..

బండ్ల గణేష్‌ రాజకీయాలకు గుడ్‌ బై... కారణం ఇదేనట-Bandla Ganesh Says Goodbye To Congress Party

రాహుల్‌ గాంధీ వద్దకు వెళ్లి మరీ పార్టీలో చేరడం వల్ల ఎమ్మెల్యేగా సీటు దక్కుతుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకోలేక పోయిన బండ్ల గణేష్‌ కనీసం కార్యకర్తగా అయినా పని చేస్తాను అంటూ చెప్పాడు. అయితే ఇంతలో ఏమైందో కాని తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తనకు అవకాశం ఇచ్చిన రాహుల్‌ గాంధీ గారికి, బండ్ల గణేష్‌ గారికి కృతజ్ఞతలు, నా వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లుగా బండ్ల బాబు పేర్కొన్నాడు.

ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను అంటూ ఆయన పేర్కొన్నాడు..

రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించిన బండ్ల గణేష్‌ కేవలం ఆరు నెలలు తిరగకుండానే అప్పుడే ప్లేట్‌ పిరాయించడంపై రకరకాలుగా విమర్శలు, వివాదం అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఒత్తిడి కారణంగా బండ్ల గణేష్‌ రాజకీయాలకు దూరం అయ్యాడా లేదంటే మరేదైనా కారణమా అంటూ టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్నాడు.

అయినా కూడా పైకి మాత్రం వ్యాపారవేత్తగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమాలు చేయలేక పోతున్న బండ్ల గణేష్‌ వ్యాపారంలో కూడా నష్టాలను చవి చూశాడట.