నేను జోకర్ ని కాదంటున్న బండ్లన్న..!  

తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి బండ్ల గణేష్ పేరు మారుమోగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆ సమయంలో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

TeluguStop.com - Bandla Ganesh Sayas That Im Not A Joker

ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లో ఉండి ప్రచారం చేయగా ఒక ఇంటర్వ్యూలో తమ పార్టీ గెలవకపోతే గొంతు కోసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆపై కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయి, టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడం జరిగింది.

అయితే ఈయన పేరు మరోసారి తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చింది.మరోసారి ఆయనను విపరీతంగా ట్రోల్ చేసినట్లు అయింది.

TeluguStop.com - నేను జోకర్ ని కాదంటున్న బండ్లన్న..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మంగళవారం నాడు జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బండ్ల గణేష్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కవిత బండ్ల గణేష్ ను గుర్తు చేయడంతో ఈసారి ఎన్నికల నేపథ్యంలో బండ్ల గణేష్ పేరు కాస్త వినిపించింది.తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇందులో భాగంగానే కవిత బండ్ల గణేష్ పేరును ప్రస్తావించింది.కవిత సోషల్ మీడియా ద్వారా గ్రేటర్ ఎన్నికల సమయంలో కొత్త జోకర్ వచ్చాడు అంటూ.ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ కామెడీ చేశాడు అని తెలిపింది.

వీటితో పాటు ఈ సారి ఫన్ మిస్ అవుతుంది అనుకున్న సమయంలో బండి సంజయ్ తెరపైకి వచ్చాడు అంటూ భారీగా డైలాగ్స్ వేసింది కవిత.

ఇదివరకు బండ్ల గణేష్ ఎలా కామెడీ చేశాడో.తాజాగా బండి సంజయ్ అలా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.వీటితో పాటు హైదరాబాద్ పేరు మారిస్తే ఏం లాభం.? పేరు కాదు, పరిపాలన విధానాలను మార్చుకోవాలని.అలాగే జిహెచ్ఎంసిలో టిఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా కవిత అన్న వ్యాఖ్యలపై తాజాగా బండ్ల గణేష్ స్పందించాడు.ట్విట్టర్ వేదికగా చేసుకొని బండ్ల గణేష్ కవిత గారు నేను జోకర్ ని కాదు.ఫైటర్ అన్నాడు.

ఏదేమైనా నేను ఇప్పుడు ఎలాంటి రాజకీయాల్లో ఉండదలచుకోలేదు అంటూ ట్వీట్ చేశాడు.ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ ఓటమి చెందడంతో తాను ఏ పార్టీలో లేనని ఇదివరకే బండ్లగణేష్ అనేక మార్లు మీడియాతో చెప్పుకొచ్చాడు.

ఇకపై కేవలం సినిమాలు వాటి వ్యాపారం సంబంధించి చూసుకుంటానని అందరికీ క్లారిటీ ఇచ్చాడు.

#Bandi Sanjay #Bandla Ganesh #Hyderabad #Kavitha #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Bandla Ganesh Sayas That Im Not A Joker Related Telugu News,Photos/Pics,Images..