'వకీల్‌ సాబ్' కు బండ్ల గణేష్‌ రివ్యూ

వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో బండ్ల గణ్‌ మాట్లాడిన మాటలు పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంటాయి.సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ స్పీచ్‌ ఇంకా కూడా ట్రెండ్డింగ్‌లోనే ఉంది.

 Bandla Ganesh Review To Pawan Kalyan Vakeel Saab Movie , Bandla Ganesh,  Bandla-TeluguStop.com

పవన్‌ ను బండ్ల గణేష్‌ ఒక మనిషి లా కాకుండా ఒక దేవుడి మాదిరిగా చూస్తూ ఉంటాడు.అందుకే ప్రతి కార్యక్రమంలో కూడా నా దేవుడు అంటూ పవన్‌ ను సంబోధిస్తూ ఉంటాడు.

అలా బండ్ల గణేష్‌ ఏం చేసినా కూడా పవన్‌ అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు.ఇక వకీల్‌ సాబ్‌ విడుదల సందర్బంగా బండ్ల గణేష్‌ ఏం ట్వీట్‌ చేసి ఉంటాడా అంటూ అంతా ఆసక్తిని కనబర్చారు.

అనుకున్నట్లుగానే బండ్ల గణేష్‌ వకీల్‌ సాబ్‌ గురించి స్పందించాడు.అది కూడా ఒక వీరాభిమాని మాటలను ఆయన మాటలుగా అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.

ట్విట్టర్‌ లో బండ్ల గణేష్‌ మాస్‌ కా బాస్‌ వకీల్‌ సాబ్‌.వాదనల్లేవ్‌ కేవలం తీర్పు మాత్రమే.బ్లాక్‌ బస్టర్‌ జై పవర్‌ స్టార్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.సినిమాలో థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ పై బండ్ల గణేష్‌ ప్రశంసలు కురిపించాడు.

అద్బుతమైన నేపథ్య సంగీతంతో నీవు సినిమాకు ప్రాణం పెట్టావు అంటూ థమన్‌ పై బండ్ల బాబు చేసిన ట్వీట్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.మొత్తానికి వకీల్‌ సాబ్‌ కు బండ్ల గణేష్‌ నుండి ఎలాంటి ట్వీట్‌ అయితే జనాలు అభిమానులు ఆశించారో అలాంటి ట్వీట్‌ వచ్చేసింది.

దీన్ని ఇక జనాలు ముఖ్యంగా పవన్‌ అభిమానులు వదిలేస్తారా కుమ్మేస్తారు అనడంలో సందేహం లేదు.బండ్ల గణేష్‌ ట్వీట్‌ ను అన్ని రకాల సోషల్‌ మీడియా పేజీల్లో కూడా అభిమానులు షేర్‌ చేస్తూ వస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube