రేణు దేశాయ్ పెళ్లిపై బండ్ల గణేష్ ట్వీట్..! ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా.?       2018-06-26   21:53:21  IST  Raghu V

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనకు మరొక తోడు దొరికిందని, ఇపుడు జీవితం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను కొన్ని రోజుల క్రితం పోస్టు చేశారు. తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు.రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు పెళ్లి చేసుకోవద్దంటూ కోరుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ తమ తమ సందేశాలను రేణుకు పంపిస్తున్నారు.

తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేశారు. `కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆ దేవుణ్ని ప్రార్థిస్తాన‌`ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై ప‌వ‌న్ అభిమానులతోపాటు, ప‌వ‌న్‌ను ఎంత‌గానో అభిమానించే నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.