అవును.. త్రివిక్రమ్ ను తిట్టాను.. ఎట్టకేలకు నిజం బయటపెట్టిన బండ్ల గణేష్!

టాలీవుడ్ నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి మన అందరికి తెలిసిందే.సినిమాలలో నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

 Bandla Ganesh Reacts Trivikram Audio Leak, Bandla Ganesh, Pawan Kalyan, Bheemla-TeluguStop.com

బండ్ల గణేష్ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు.

ఇకపోతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.వీరాభిమాని అనడం కంటే భక్తుడు అనడం మేలు.

 Bandla Ganesh Reacts Trivikram Audio Leak, Bandla Ganesh, Pawan Kalyan, Bheemla-TeluguStop.com

పవన్ కళ్యాణ్ పై ఎవరైనా కొంచెం నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు అంటే చాలు వారిని ఏకిపారేస్తూ ఉంటారు.

అంతేకాకుండా వారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరొక వివాదానికి తెలియలేపాడు బండ్ల గణేష్.భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియో లుక్ ఒకటి ఎంత వివాదాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఒక అభిమాని బండ్ల గణేష్ కు ఫోన్ చేసి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలి పవన్ గురించి అద్భుతమైన స్పీచ్ ఇవ్వాలి అని కోరగా.ఇప్పుడు బండ గణేష్ లేదమ్మా నేను రావడం లేదు.

నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు.ఆ త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట.

త్రివిక్రమ్ నన్ను రానివ్వకుండా ప్లాన్ చేశాడు.

నేను ఈవెంట్ కి రాకపోతే అందరూ బండ్లన్న ఎక్కడ బండ్లన్న ఎక్కడ అని అరవండి నేను అక్కడే ఉంటా, మీరు పిలవగానే వచ్చేస్తా అని దర్శకుడు త్రివిక్రమ్ నీ బూతులు తిట్టాడు.ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఈ ఆడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే.కానీ బండ్ల గణేష్ మాత్రం ఆ వాయిస్ తనది కాదని ఎవరో మిమిక్రీ చేశారని బుకాయించాడు.

ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్లన్న ఆ వాయిస్ తనదే అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చాడు.

అవును ఆ ఆడియో లో ఉన్న వాయిస్ నాదే.మనిషి అన్న తర్వాత కోపాలు రావడం సహజం.

కోపంలో త్రివిక్రమ్ ను తిట్టింది నేనే.ఆ తర్వాత సారీ కూడా చెప్పాను అని తెలిపాడు బండ్ల గణేష్.

Video : Bandla Ganesh Reacts Trivikram Audio Leak, Bandla Ganesh, Pawan Kalyan, Bheemla Nayak, Audio Leak, Trivikram #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube