రూటు మార్చిన బండ్ల గణేష్.. ఈసారి మెగా ప్లాన్?

టాలీవుడ్‌లో దర్శకనిర్మాతలు ఎప్పుడు, ఎలా ప్లేట్ మారుస్తారో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.ఒక హీరోతో సినిమా చేస్తామని చెబుతూనే మరో హీరోతో ఫిక్స్ అవుతుంటారు ఇక్కడి దర్శకనిర్మాతలు.

 Bandla Ganesh Planning Big For Megastar, Bandla Ganesh, Chiranjeevi, Pawan Kalya-TeluguStop.com

అయితే తాను అందరిలాంటి వాడి కాదంటూ.తనకంటూ ప్రత్యేకంగా ఇది ఉందంటూ.

ఇది అంటూనే అది అంటూ.ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు నిర్మాత కమ్ యాక్టర్ బండ్ల గణేష్.

కమెడియన్ నుండి స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసబెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గణేష్, తన నెక్ట్స్ మూవీని పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే పలుమార్లు పవన్ కళ్యాణ్ భజన చేస్తూ సినీ ఇండస్ట్రీలో నిత్యం వార్తల్లో నిలిస్తున్న బండ్ల గణేష్, ప్రస్తుతం తన రూటు మార్చినట్లు తెలుస్తోంది.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున బండ్ల గణేష్ మెగాస్టార్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మెగాస్టార్‌తో తన నెక్ట్స్ మూవీకి సంబంధించి కొంతమేర చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.ఓ సాలిడ్ కథను చిరు కోసం బండ్ల గణేష్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ నుండి ఉన్నపలంగా మెగాస్టార్ వైపు బండ్ల గణేష్ ఆసక్తి చూపడంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఏదేమైనా మెగాస్టార్ కోసం బండ్ల ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో, ఈ సినిమాకు చిరు ఓకే చెబుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా, అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.మరి బండ్ల మెగా ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube