పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునే సినిమా తీస్తా అంటున్న బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ రెండేళ్ళుగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఆయన చేస్తున్న వకీల్ సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అనే ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.

 Bandla Ganesh Plan To Movie With Pawan Kalyan, Tollywood, Telugu Cinema, South C-TeluguStop.com

పవన్ కళ్యాణ్ మానియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన ప్రాజెక్టులు అన్ని హోల్డ్ లో పడిపోయాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత బండ్ల గణేష్.ఆ సినిమా పవన్ కళ్యాణ్ ని తిరిగి నిలబెట్టింది.

అతని స్టామినాని పరిచయం చేసింది.బండ్ల గణేష్ కి కూడా భారీగా లాభాలు తెచ్చి పెట్టింది.

ఈ సినిమా స్థాయిలో బండ్ల బాబుకి మరి ఏ సినిమా కూడా కలెక్షన్స్ అందించ లేకపోయింది.

ఇదిలా ఉంటే బండ్ల గణేష్ దృష్టిలో పవన్ కళ్యాణ్ దేవుడు.

అతని మీద ఎప్పటికప్పుడు తన స్వామి భక్తిని చాటుకుంటూ ఉంటాడు.అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు.

అలాగే పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం అయిన ఇస్తా అంటాడు.అయితే అతనిది అతి అని చాలా మంది అంటారు.

కాని పవన్ కళ్యాణ్ మీద అభిమానం మాత్రం అతను పదే పదే చూపించుకుంటూ ఉంటాడు.తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంతోషాన్ని అందించే వార్త ఒకటి పోస్ట్ చేశాడు.

అవకాశం ఉంటే ఈ ఏడాది పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునే స్థాయిలో అదిరిపోయే సినిమా ఒకటి తీస్తా అని ప్రకటించాడు.ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

మరి బండ్ల గణేష్ కోరికని పవన్ కళ్యాణ్ ఎంత వరకు తీరుస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube