ఆ కండీషన్స్‌ ఒప్పుకుంటే బిగ్‌బాస్‌కు బండ్ల గణేష్‌  

Bandla Ganesh Participate In Big Boss Telugu Show-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మరి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుంది.ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలను సీజన్‌ 3 కోసం నిర్వాహకులు సంప్రదించడం జరిగిందని తెలుస్తోంది.తాజాగా బండ్ల గణేష్‌ను కూడా నిర్వాహకులు సంప్రదించారట.అయితే నిర్వాహకులకు బండ్ల గణేష్‌ నేరుగా నో చెప్పకుండా కొన్ని కండీషన్స్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది.తాను ఫోన్‌ లేకుండా ఉండటం కష్టం అని, అందుకే వారంలో కొన్ని సార్లు అయినా ఫోన్‌ను తనకు అందుబాటులో ఉంచాలన్నాడట...

Bandla Ganesh Participate In Big Boss Telugu Show--Bandla Ganesh Participate In Big Boss Telugu Show-

ఫోన్‌లో తన కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు తనకు ప్రత్యేక ఏర్పాట్లు, పరిమితులు ఉండాలన్నట్లుగా చెప్పాడట.బండ్ల కండీషన్స్‌కు అవాక్కయిన నిర్వాహకులు అందరికి ఒకేరకమైన కండీషన్స్‌ ఉంటాయి.ప్రతి ఒక్కరు వాటిని ఫాలో అవ్వాల్సిందే.

ఫోన్‌ అందుబాటులో ఉంచలేం అంటూ తేల్చి చెప్పారు.దాంతో చేసేది లేక బండ్ల గణేష్‌ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, సినిమాల్లో ఛాన్స్‌లు లేని బండ్ల గణేష్‌ ఒప్పుకుంటాడని నిర్వాహకులు భావించారట.

Bandla Ganesh Participate In Big Boss Telugu Show--Bandla Ganesh Participate In Big Boss Telugu Show-

నిర్వాహకులు ఇంకా పలువురు సెలబ్రెటీలతో చర్చలు జరుపుతున్నారు.వారి నుండి ఇంకా ఎలాంటి స్పందన వచ్చింది, అసలు ఫైనల్‌గా ఉండేది ఎవరు అనే విషయాలు మరి కొన్ని రోజుల్లో షో ప్రారంభం అయితే తెలిసే అవకాశం ఉంది.జులై లాస్ట్‌ వరకు షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయగా, రెండవ సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేశాడు.

మూడవ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.మూడవ సీజన్‌కు సంబంధించిన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు.