కాంగ్రెస్ ను వీడిన బండ్ల మళ్లీ జనసేన అంటాడా?

బండ్ల గణేష్‌ నటుడిగా బిజీగా లేకున్నా.నిర్మాతగా వరుసగా సినిమాలు చేయకున్నా కూడా ఆయన ఒక స్టార్‌ సెలబ్రెటీ.

 Bandla Ganesh May Be Join In Pawan Kalyan Janasena, Bandla Ganesh, Film News, Ja-TeluguStop.com

ఆయన పవన్‌ కు అభిమాని అవ్వడం వల్ల ఆయన్ను ఒక స్టార్‌ గా చూసే వారు చాలా మంది ఉన్నారు.ఆయన్ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా పెద్దగానే ఉంది.

నెట్టింట ఆయన గురించి జరిగే చర్చ ఎప్పుడు కూడా ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.అందుకే ఆయన గురించి ప్రనస్తుతం జరుగుతున్న చర్చ ఒకటి ఆసక్తిగా మారింది.

ఆమద్య ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ కాంగ్రెస్‌ లో జాయిన్‌ అయ్యాడు.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి కాంగ్రెస్ గెలవకుండా ఏకంగా గుండు కొట్టించుకుంటాను అంటూ ఛాలెంజ్ కూడా చేశాడు.

అంతటి ఛాలెంజ్ లు చేసిన బండ్ల గణేష్ తీరా పార్టీ ఓడిపోవడంతో పార్టీకి దూరం అయ్యాడు.

బండ్ల గణేష్ ఇటీవలే తాను ఏ పార్టీకి సంబందించిన వాడిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

పవన్‌ అంటే అంత అభిమానం ఉన్న వ్యక్తి ఎందుకు తెలంగాణలో జనసేన జెండా మోయడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆ విషయంలో బండ్ల గణేష్ నుండి ఒక స్పష్టత వచ్చింది.

తాజాగా ఆయన ట్విట్టర్ లో ‘తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Bandla Janasena, Janasena, Pawan Kalyan, Tel

ఆయన ట్వీట్‌ కు పవన్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు.కాంగ్రెస్ ను వీడిన బండ్ల బాబు త్వరలోనే జనసేన పార్టీ కండువాను పవన్ కళ్యాన్ చేతుల మీదుగా కప్పించుకుంటాడేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.బండ్ల గణేష్‌ తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసినా కూడా ఆశ్చర్యం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణ లో కేసీఆర్‌ కు ఇన్నాళ్లు సపోర్ట్‌ గా నిలిచిన బండ్ల బాబు ఇప్పుడు జనసేన పార్టీ తరపున మాట్లాడుతాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube