చిరంజీవిపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. వైరల్ ట్వీట్‌!

నటుడిగా నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

 Bandla Ganesh Interesting Comments On Chiranjeevi, Bandla Ganesh, Megastar Chira-TeluguStop.com

అదేవిధంగా బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కి మైక్ చేపడితే చాలు తను దేవుడిగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఏ సమయం సందర్భం లేకుండా చూపిస్తుంటారు.

ఎప్పుడు తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతుండే బండ్లన్న తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు షేర్ చేస్తూ.మా దేవరకి అన్న.అందరికీ నేను అనే నమ్మకం.మనిషి అంటే ఎలా ఉండాలి అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి పెద్దన్న అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించే ఎమోజీ లను పెట్టి పోస్ట్ చేశారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Bandla Ganesh, Chiranjeevi, Tollywood-Movie

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడుతోందని చికిత్స కోసం చాలా మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని ఎవరైనా సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించడంతో బండ్ల గణేష్ స్పందిస్తూ గూగుల్ పే నంబర్ ఇవ్వండి ఆ దేవుడి ఆశీస్సులతో అమ్మని బతికించుకుందాం అంటూ కామెంట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube