బండ్ల గణేష్‌ ఒంటరి పోరాటం ఫలించేనా?

నటుడిగా నిర్మాతగా టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.మొదట ఈయన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ లో జనరల్‌ సెక్రటరీ గా పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

 Bandla Ganesh In Maa Elections-TeluguStop.com

కాని ప్రకాష్ రాజ్ అనూహ్యంగా జీవితకు అవకాశం ఇవ్వడంతో ఆయన ప్యానల్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.ప్రకాష్ రాజ్‌ తీరును పెద్దగా విమర్శించకుండా ప్రెసిడెంట్‌ గా పోటీ పడకుండా ప్రకాష్ రాజ్ ప్యానల్‌ లో ఏదైతే అనుకున్నాడో అదే పోస్ట్ కు బండ్ల గణేష్‌ సింగిల్ గా పోటీ చేసేందుకు సిద్దం అయ్యాడు.

మొన్నటి వరకు బండ్ల గణేష్‌ పోటీ గురించి సందిగ్దం నెలకొంది.కాని తాజాగా ఆయన అధికారికంగా తనను గెలిపించాలంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి తన ఎన్నికల ప్రచారం ను షురూ చేయడం జరిగింది.

 Bandla Ganesh In Maa Elections-బండ్ల గణేష్‌ ఒంటరి పోరాటం ఫలించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకే ఒక్క ఓటు మా కోసం మన కోసం, మన అందరి కోసం.మా తరపున ప్రశ్నించడం కోసం అంటూ తనను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవాల్సిందిగా బండ్ల గణేష్ విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రెసిడెంట్ గా మీకు ఇష్టం అయిన వారిని ఎంపిక చేసుకోండి.వైస్ ప్రెసిడెంట్‌ ను ఇతర సభ్యులను మీకు ఇష్టం అయిన వారిని ఎంపిక చేసుకోండి.కాని జనరల్ సెక్రటరీగా మాత్రం నాకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నాడు.బండ్ల గణేష్‌ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.మెగా ఫ్యామిలీ సన్నిహితుడు అనే పేరు కూడా బండ్ల బాబుకు ఉంది.కనుక ఖచ్చితంగా ఈ పోటీలో బండ్ల గణేష్ కు అంతా మద్దతుగా నిలవడం ఖాయం.

ఆయన పోటీ చేస్తున్న జనరల్‌ సెక్రటరీగా ఎన్నిక అవ్వడం కూడా ఖాయం అంటున్నారు.నిర్మాతగా బండ్ల గణేష్‌ కు మంచి పేరు ఉంది.

అందుకే ఆయన్ను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని కొందరు భావించే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి బండ్ల గణేష్‌ గెలుపు పై ఇండస్ట్రీ వర్గాల వారు ధీమాగానే కనిపిస్తున్నారు.

మరి ఆయన ఒంటరి పోరాటం ఎంత వరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.

#Bandla Ganesh #Prakash Raj #MAA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు