బండ్ల చిన్న మాటతో పెద్ద వివాదం సమసి పోయింది  

Bandla Ganesh Give The clarity About His And Harish Shanker Issue, Bandla Ganesh, Harish Shanker, Gabbar Singh, Nagababu, Tollywood - Telugu Bandla Ganesh, Gabbar Singh, Harish Shanker, Nagababu, Tollywood

టాలీవుడ్‌ సెన్షేషనల్‌ మూవీ గబ్బర్‌ సింగ్‌ గురించి కొన్ని రోజుల క్రితం దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ నిర్మాత అయిన బండ్ల గణేష్‌ పేరును ఎత్తకుండా ఇతర విషయాలను చెప్పుకొచ్చాడు.బండ్ల గణేష్‌ కు అసలు పెద్దగా ప్రాముఖ్యత లేదు అన్నట్లుగా హరీష్‌ శంకర్‌ మాట్లాడటంతో విశ్వాసం లేని మనిషి అంటూ హరీష్‌ శంకర్‌పై తీవ్ర స్థాయిలో బండ్ల గణేష్‌ వ్యాఖ్యలు చేశాడు.

 Bandla Ganesh Harish Shanker Gabbar Singh

నేను ఆఫర్‌ ఇచ్చాను, అలాంటి నా గురించి మాట్లాడక పోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ బండ్ల గణేష్‌ సీరియస్‌ అయ్యాడు.

బండ్ల వ్యాఖ్యలపై హరీష్‌ శంకర్‌ మరింత ఫైర్‌ అయ్యాడు.

బండ్ల చిన్న మాటతో పెద్ద వివాదం సమసి పోయింది-Movie-Telugu Tollywood Photo Image

గబ్బర్‌ సింగ్‌ తో నేను బండ్ల గణేష్‌కు లైఫ్‌ ఇచ్చాను.అసలు గబ్బర్‌ సింగ్‌ ఆఫర్‌ నాకు నాగబాబు గారు పవన్‌ కళ్యాణ్‌ గారు ఇచ్చారు.

వారి వల్లే నేను ఆ సినిమాను చేశాను.గత చిత్రాలతో నష్టాల్లో ఉన్న బండ్ల గణేష్‌ను నేను ఆదుకున్నాను అంటూ హరీష్‌ శంకర్‌ వ్యాఖ్యలు చేయడంతో వివాదం చాలా పెద్దగా మారింది.

ఇద్దరి మద్య మాట మాట పెరిగింది.హోరా హోరీగా సాగిన మాటల యుద్దం ఎక్కడకు దారి తీస్తుందో అనుకున్నారు.

అంత పెద్దగా మారిన వివాదంను చిన్న మాటతో బండ్ల గణేష్‌ చల్లార్చేశాడు.మా ఇద్దరిది అన్నదమ్ముల బంధం.మేము అన్నదమ్ముల మాదిరిగా గొడవ పడతాం.ఆ తర్వాత కలిసి పోతాం.అన్నదమ్ముల మద్య ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అంటూ తాజా ఇంటర్వ్యూలో బండ్ల వ్యాఖ్యలు చేశాడు.ఆ వ్యాఖ్యలతో అంత పెద్ద వివాదం చప్పున చల్లారింది.

#Bandla Ganesh #Gabbar Singh #Harish Shanker #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bandla Ganesh Harish Shanker Gabbar Singh Related Telugu News,Photos/Pics,Images..