బండ్ల గణేష్ కి జ్ఞానోదయం అయ్యింది! అందుకే రాజకీయాలకి దూరం అని ప్రకటన  

రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన బండ్ల గణేష్. .

Bandla Ganesh Gives Clarity About Quit From Politics-

తెలంగాణలో ఎన్నికల ముందు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్.తన అతి తెలివిని ఇండస్ట్రీలో లానే రాజకీయాలలో కూడా చూపించే ప్రయత్నం చేసాడు.ఎన్నికల ముందు మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలవకపోతీ బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అంటూ వాఖ్యలు కూడా చేసాడు..

Bandla Ganesh Gives Clarity About Quit From Politics--Bandla Ganesh Gives Clarity About Quit From Politics-

ఇక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఘోర ఓటమితో బండ్ల గణేష్ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసారు.నెటిజన్ల దెబ్బకి దారిలోకి వచ్చిన బండ్ల చేసిన తప్పుకి సారీ కూడా చెప్పాడు.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బండ్ల ప్రకటించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసాడు.

దానికి కారణం ఏంటి అనేది తాజాగా ఓ మీడియాలో చెప్పుకొచ్చాడు.రాజకీయాల మీద నాకు ఆసక్తి లేదు.చేయలేనని భయమేసింది.

తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది.జీవితంలో పెద్ద తప్పు చేశాను.అంత సమర్థతత లేదని తప్పుకున్నా.నా ఆప్తులంతా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.వారందరికీ దూరమవడం నాకిష్టం లేదు.

దరిద్రం నెత్తి నుండి ఎన్నికల సమయంలో నోటికొచ్చినట్టు మాట్లాడాను.దాంతో ఆప్తులను కోల్పోయి శత్రువులను కొని తెచ్చుకున్నట్టయింది.అందుకే నన్ను నేను మోసం చేసుకోవడం ఎందుకని రాజకీయాల నుంచి తప్పుకున్నాను అంటూ తాను రాజకీయాలకి దూరం అవడంపై క్లారిటీ ఇచ్చేసాడు.