ఆ యాంకర్ కు చుక్కలు చూపించిన బండ్ల గణేష్.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వేడి రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.మా అసోసియేషన్ ఎన్నికల బరిలోకి ఐదుగురు సభ్యులు పోటీపడగా వీరిలో ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Bandla Ganesh Fires On Ntv Anchor In Live Show Over The Maa Elections,  Bandla G-TeluguStop.com

ఈ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ రోజుకు ఒక ట్విస్ట్ తో అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు.ప్రకాష్ రాజ్ పానెల్ లో భాగంగా మొదటి నుంచి అన్నీ తానే చూసుకునే బండ్ల గణేష్ చివరి నిమిషంలో అతనికి హ్యాండ్ ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ జనరల్ సెక్రటరీ పదవికి బండ్లగణేష్ ను కాకుండా జీవిత-రాజశేఖర్ ను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి రంగంలోకి దింపడంతో అసలు కథ మొదలైంది.

తనని కాకుండా జీవిత రాజశేఖర్ ను జనరల్ సెక్రటరీగా ప్రకటించడంతో బండ్ల జీవిత పై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే తను ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు వ్యతిరేకం కాదంటూనే జీవిత పై పోటీ చేస్తున్నారు.అయితే జీవిత గతంలో మెగాస్టార్, తన దేవుడు పవర్ స్టార్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ కోపం వల్లే జీవితంపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ న్యూస్ డిబేట్ లో పాల్గొంటూ మా ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోని ఎన్టీవీ డిబేట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ యాంకర్ చక్రి మధ్య హార్డ్ డిస్కషన్ జరిగింది.

Telugu Anchor Chakri, Bandla Ganesh, Congress, Maa, Ntv Anchor, Prakash Raj, Ban

ఈ క్రమంలోనే యాంకర్ చక్రి బండ్ల గణేష్ ని ఉద్దేశించిమీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో నాలుక కోరుకుంటానని చెప్పారు.ఎప్పుడైనా మాట మీద నిలబడ్డాడు అంటూ ప్రశ్నించగా.బండ్ల గణేష్ కు బాగా మండింది.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను ఎప్పుడు నాలుక కోసుకుంటా అనలేదని ఏ విషయము తెలియకుండా మాట్లాడొద్దు అంటూ యాంకర్ పై ఫైర్ అయ్యారు.

బండ్ల గణేష్ మాటలకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా యాంకర్ నేను చూసాను మీరు 7’O’ క్లాక్ బ్లేడ్ తో నాలుక కోసుకుంటానని చెప్పారని యాంకర్ అనగా నేను ఇక్కడే కూర్చుంటాను మీకు ధైర్యం ఉంటే నేను అన్న మాటలను ప్లే చేసి చూపించండి అంటూ యాంకర్ కు సవాల్ విసిరారు.

Telugu Anchor Chakri, Bandla Ganesh, Congress, Maa, Ntv Anchor, Prakash Raj, Ban

ఇప్పుడు ప్లే చేయాలంటే కాస్త సమయం పడుతుంది అంటూ ఆ టాపిక్ అక్కడితో వదిలేసిన యాంకర్ తిరిగి బండ్ల గణేష్ ను మా జనరల్ సెక్రటరీగా గెలవకపోతే ఏం చేస్తారనే ప్రశ్న అడగడంతో.మరోసారి మండిపడిన బండ్ల గణేష్ గెలవకపోతే అని అంటారేంటి?? శుభమా అని పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు ముండేది అనకండి అంటూ భారీ కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంలో యాంకర్ డిబేట్లో అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు అనగా నువ్వు మాట్లాడటం అన్ పార్లమెంటరీ కాదా గెలవకపోవడం అని అనకూడదు కదా అంటూ యాంకర్ కు చుక్కలు చూపించారు.

అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మరి బ్లేడ్ తో నాలుక కాదు గొంతు కోసుకుంటానాని చెప్పానని బండ్లగణేష్ అనగా మరి కోస్తున్నారా అని ప్రశ్నించారు యాంకర్.కోసుకుందామంటే వెళ్ళాను కానీ పోలీసులు బొక్కలో వేస్తారని ఆగిపోయాను అంటూ సమాధానం చెప్పారు.

మొత్తానికి ఈ డిబేట్ ద్వారా బండ్ల గణేష్ యాంకర్ కి చుక్కలు చూపించడమే కాకుండా మరోసారి సంచలనంగా మారిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube