పవన్ కళ్యాణ్ ఒంగి ఒంగి దండం పెట్టడంపై బండ్ల గణేష్ కామెంట్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.నిత్యం పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తూ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావిస్తూ పవన్ జపం చేస్తూ ఉండే బండ్ల గణేష్ ఏ వేదిక ఎక్కిన లేదా సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉంటారు.

 Bandla Ganesh Fires On Netizen Who Trolled Pawan Kalyan , Bandla Ganesh, Pawan K-TeluguStop.com

ఇలా పవన్ కళ్యాణ్ పై ఉన్న భక్తిని చాటుతూ ఆయనపై ఈగ వాలకుండా ఆయన గురించి ఏ విధమైనటువంటి తప్పు వార్త వచ్చిన తిప్పికొడుతూ పవన్ భక్తుడు అనిపించుకుంటారు.

ఈ విధంగా సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అయినటువంటి బండ్లగణేష్ రాజకీయాల పరంగా మాత్రం తన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో తనకు అవకాశం ఇస్తే తప్పకుండా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానని బండ్ల గణేష్ వెల్లడించారు.ఇలా రాజకీయపరంగాను, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటూ పవన్ పై ఈగ కూడా వాలనివ్వరు.

Telugu Bandla Ganesh, Congress, Janasena, Netizens Trolls, Pawan Kalyan-Movie

ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తుతం ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వంగి వంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన పలువురు రాజకీయ నాయకులకు దండం పెడుతున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బండ్ల గణేష్ ట్వీట్ పై స్పందించి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పందిస్తూ పెద్దలకు నమస్కారం మన సంస్కారం రా లాఫూట్ అంటూ బండ్ల గణేష్ నెటిజన్ కి గట్టి సమాధానం చెప్పారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube