బండ్ల గణేష్‌ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించగా వారికి నెగటివ్‌ వచ్చింది.

 What About Bandla Ganesh Health Condition, Bandla Ganesh, Coronavirus, Bandla Ga-TeluguStop.com

బండ్ల గణేష్‌కు కరోనా ఎలా ఎటాక్‌ అయ్యింది అనే విషయంను అధికారులు ఇంకా నిర్థారించలేదు.అయితే ప్రస్తుతం బండ్ల గణేష్‌ ఆరోగ్యం కుదుట పడుతుందని అంటున్నారు.

బండ్ల గణేష్‌ ప్రస్తుతం ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నాడు.

బండ్ల గణేష్‌కు తీవ్రమైన లక్షణాలు లేకపోవడంతో ఆయనకు వెంటిలేటర్‌ అమర్చలేదని వైధ్యులు పేర్కొన్నారు.

త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటాడు అంటూ వైధ్యులు చెబుతున్నారు.మరో సారి ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

బండ్ల గణేష్‌కు కాంటాక్ట్‌ అయిన పలువురిని కూడా వెంటనే ఐసోలేషన్‌కు పంపించే ఉద్దేశ్యంతో ఉన్నారు.ప్రస్తుతం బండ్ల ఫ్యామిలీ మొత్తం కూడా హోం క్వారెంటైన్‌లో ఉన్నారు.

Telugu Bandla Ganesh, Coronavirus-Movie

ఇక బండ్ల గణేష్‌ సినిమాల విషయానికి వస్తే ఆమద్య వరుసగా సినిమాలు నిర్మించిన ఈయన ఆర్థిక వనరులు లేకపోవడంతో నిర్మాణంకు దూరం అయ్యాడు.స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఈయన మళ్లీ నటనలోకి అడుగు పెట్టాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కమెడియన్‌గా కనిపించాడు.అయితే ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ నటనపై ఆసక్తి చూపడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube