పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను మోసం చేశారా.. అన్యాయం చేయొద్దంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అమితంగా అభిమానించే సినిమా సెలబ్రిటీలలో బండ్ల గణేష్ ఒకరనే సంగతి తెలిసిందే.చాలామంది హీరోలతో సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ ఇతర హీరోలతో పోల్చి చూస్తే పవన్ పై అభిమానాన్ని చాటుకోవడానికి ఇష్టపడతారు.

 Bandla Ganesh Comments Goes Viral In Social Media Details Here Bandla Ganesh ,-TeluguStop.com

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలలో తీన్ మార్ ఫ్లాప్ గా నిలిస్తే గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

దబాంగ్ రీమేక్ గా పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అవుతోంది.

ఆ ఆడియో టేప్ లో బండ్ల గణేష్ జీవితంలో ఎవ్వరినీ నమ్మొద్దని మనల్ని మనం నమ్ముకుందామని మనకు జన్మనిచ్చిన తల్లీదండ్రులను నమ్ముకుందామని పేర్కొన్నారు.నమ్మివచ్చిన భార్యను, జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దామని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

Telugu Bandla Ganesh, Gabbar Singh, Pawan Kalyan, Teenmar, Tollywood-Movie

వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామని తల్లీదండ్రులకు మంచి లైఫ్ ను ఇద్దామని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.మనపై వాళ్లు కోటి ఆశలతో ఉన్నారని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు.మన పిల్లలకు మంచి దారి చూపిద్దామని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.వాళ్లవీళ్ల మోజులో పడి పిల్లలకు, పేరెంట్స్ కు అన్యాయం చేయవద్దని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.

బండ్ల గణేష్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బండ్ల గణేష్ వైరల్ అయిన ఆడియో టేప్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఈ ఆడియో టేప్ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube